స్పోర్ట్స్

అరుదైన రికార్డుపై రోహిత్‌-ధావన్‌ గురి

ముంబయి : టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఆస్ట్రేలియాపై వీరిద్దరు కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పితే అరుదైన ఘనత సాధిస్తారు. వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన జోడీగా రికార్డు సష్టిస్తారు. ఈ జాబితాలో ప్రస్తుతం వెస్టిండీస్‌ ఆటగాళ్లు గ్రీనిడ్జ్‌-హేన్స్‌ జంటతో (భారత్‌పై 6) కలిసి రోహిత్‌-ధావన్‌ సమంగా నిలిచారు. మూడో స్థానంలో ధోనీ-యువరాజ్‌ సింగ్‌ ఉన్నారు. వీరిద్దరూ కలిసి పాకిస్థాన్‌పై అయిదు శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆసీస్‌పై రోహిత్‌-ధావన్‌కు మంచి రికార్డు ఉంది. వీరిద్దరు కలిసి ఆసీస్‌పై 22 ఇన్నింగ్స్‌ల్లో 1,273 పరుగులు చేశారు. శ్రీలంక సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్‌ రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసీస్‌ వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. అయితే ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్‌ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన ధావన్‌ కూడా శ్రీలంకపై అర్ధశతకం బాది ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో రాహుల్‌ను నాలుగోస్థానంలో పంపించి హిట్‌ జోడీగా పేరున్న రోహిత్‌-ధావన్‌ను ఓపెనర్లుగా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ముంబయి వేదికగా రేపు తొలి మ్యాచ్‌, జనవరి 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 19న బెంగళూరులో ఆఖరి మ్యాచ్‌ జరగనుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close