Featuredస్టేట్ న్యూస్

జీహెచ్‌ఎంసీలో నీతిమాలిన పనులు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): ఇటీవల భారీ ఖర్చుతో వేసిన సిసి రోడ్లను తొలగించి, జిహెచ్‌ఎంసిలోని ఇంజనీరింగ్‌ విభా గంలో కొంత మంది అవినీతి అధికారులు కాంట్రాక్టర్లతో కమీష న్లకు కక్కుర్తిపడి సిసి రోడ్లపై వర్షపు నీరు నిల్వ అవుతున్నాయని కుంటి సాకులు చెబుతూ లక్షల రూపాయల ప్రజల సొమ్మును వెచ్చించి వేసిన సిసి రోడ్లను పగలగొట్టడంతో స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. కుర్మగూడ డివిజన్‌ సాయి లాల్‌ తోట శివుని గుడి ప్రాంతంలో జిహెచ్‌ఎంసి అధికారులు వారి స్వార్థ ప్రయో జనాల కోసం మంచి సిసి రోడ్లను స్థానికుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకున్నా రోడ్లను పగలగొట్టడం కొత్తగా సిసి రోడ్డును వేయడం ఏంటని స్థానికులు అధికారులకు నిలదీశారు. ఆదాబ్‌ హైదరా బాద్‌ ప్రతినిధి స్థానికులకు సంప్రదించగా మేము సమస్య ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే వాళ్ళం, వర్షం పడ్డా ఈ రోడ్డుపై ఎలాంటి వర్షం నీరు నిలువదు, అలాంటిది అధికారులు ఈ రోడ్డుపై వర్షం పడితే వర్షం నీరు నిలుస్తున్నాయి అనేది అవాస్తవం, అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజల సొమ్మును వధా చేస్తున్నారు అని స్థానికులు వారి అభిప్రాయాన్ని తెలిపారు. ఇదేవిధంగా కుర్మగూడ డివిజన్‌లో పలు ప్రాంతాలలో అవినీతి పనులు జరుగుతున్నాయి అని స్థానికులు ఆరోపిస్తున్నా రు. ముందే లోటు బడ్జెట్‌తో ఇబ్బందిపడుతున్న జి హెచ్‌ ఎంసి, క్రింది స్థాయి అధికారుల నీతిమాలిన పనుల వల్ల మరిన్ని ఇబ్బం దులు పడే పరిస్థితి ఏర్పడింది. జిహెచ్‌ఎంసిలో ప్రస్తుతం నెల వారి నిర్వహణ ఖర్చులు పెనుభారంగా మారినట్లు రోజు వార్తా కథనాలు చదువుతున్నాను, అవినీతి అధికారుల బాధ్యత రహిత పనులతో జిహెచ్‌ఎం సికి మరిన్ని సమస్యలు ఎదురయ్యే పరిస్థితి

కనిపిస్తుంది.

ఇప్పటికైనా ఉన్నత అధికారులు, ప్రభు త్వం మేల్కొ ని అవినీతి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతు న్నారు. వర్షపు నీరు రోడ్డుపై నిలుస్తూ ఉండటంతో వాహనదా రులకు ఇబ్బంది అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో రోడ్డు మరమ్మత్తులు చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్‌ ఇంజ నీర్‌ నర్సింగ్‌ రావు ఆదాబ్‌ హైద్రాబాద్‌ ప్రతినిధికి వివరణ ఇచ్చారు.

సామాజిక కార్యకర్త సుదర్శన్‌

రోడ్ల మరమత్తు పేరుతో ప్రజల సొమ్మును వధా చేస్తున్న జిహెచ్‌ ఎంసి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close