బిజినెస్

ఆదాయం అర్ధబిలియన్‌కు చేరాలి

బెంగళూరు: సాఫ్ట్‌వేర్‌ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వచ్చే మూడేళ్లలో దేశీయంగా తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుతం భారత్‌ నుంచి ఇన్ఫోసిస్‌కు 270 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తోంది. ఇది మొత్తం కంపెనీ ఆదాయంలో 2.3శాతం. ఈ నేపథ్యంలో భారత్‌లో 500 మిలియన్‌ డాలర్ల ఆదాయం పొందాలన్నది లక్ష్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు భారత్‌లో అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తోంది. జనవరిలో ఇన్ఫీ దాదాపు 4,200 కోట్లు విలువైన ఆదాయపు పన్నుశాఖకు చెందిన కాంట్రాక్టును దక్కించుకొంది. ఈ కంపెనీ ఇప్పటికే ఐటీ శాఖకు చెందిన సీపీసీ ప్రాజెక్టును కూడా నిర్వహిస్తోంఇ. 2015లో కంపెనీ రూ.1,380 కోట్ల విలువైన జీఎస్‌టీ నెట్‌వర్క్‌ తయారీ, నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకొంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close