Featuredరాజకీయ వార్తలు

అధికారం కోసం కమ్మని ఉచ్చు

★ ‘టార్గెట్ రెడ్డి’కి తాత్కాలిక విరామం
★ తెలంగాణలో దిక్కుతోచని ‘అధికార చౌదరీలు’
★ ‘ఓటుకు నోటు’ కేసులో తనిఖీలు
★ రూ. 50 లక్షలు ఎక్కడివని కూపీ
★ కిడ్నాప్ కలకలం
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
నియంత అనగా సంపూర్ణ అధికారంతో చలాయించే పాలకుడు. ఒక రాజ్యం ‘నియంత’చే పాలించబడడాన్ని నియంతృత్వం అంటారు. ఈ పదం అత్యవసర సమయాల్లో గణతంత్రరాజ్యం పాలించేందుకు సెనేట్ చే నియమింపబడే పురాతన ‘రోమ్’లోని మేజిస్ట్రేట్ టైటిల్ గా ఉద్భవించింది. నియంతను ఆంగ్లంలో ”డిక్టేటర్’ అంటారు. నియంత నియంతృత్వం శృతి మించినప్పుడు అతనిని క్రూరునితో పోల్చుతారు…. అయితే ఆ పదం సమానార్థం కాదు.

కమ్మని ‘టార్గెట్‌’:
రేవంత్‌ ఇంట్లో సోదాల లక్ష్యం వేరు.. ఉదయసింహ, సెబాస్టియన్‌ ఇళ్లలో సోదాల లక్ష్యం వేరు.. వెరసి అంతిమంగా ‘ఓటుకు నోటు’ కేసులో కదలిక వచ్చింది. 50 లక్షలు వ్యవహారం చుట్టూ విచారణ తిరుగుతోంది. అందులో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ‘బాబు’లే కేంద్రంగా ముందుకు ఉరుకుతోంది. రేవంత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల వెనుక అసలు ‘టార్గెట్‌ కమ్మ’ అనే విషయం నెమ్మదిగా వెలుగు చూస్తోంది. ఓటుకు నోటు కేసును తవ్వడమే తనిఖీల అసలు లక్ష్యమా!? ఈ సోదాల వెనుక గులాబీ ఒత్తిడి ఉందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు.

‘రెడ్డి టార్గెట్‌’ తరువాత ‘టార్గెట్ కమ్మ’ చేయాలని తెరవెనుక పెద్దకథే నడుస్తున్నట్లు కనిపిస్తోంది!?

రేవంత్‌రెడ్డి ఇంట్లో
ఓటుకు నోటు కేసులో నిందితులు ఉదయసింహ, సెబాస్టియన్‌ ఇళ్లల్లోనూ సోదాలు జరగడం.. ఉదయసింహ, రేవంత్‌ రెడ్డిలను కలిపి విచారించడమే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది. అప్పట్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో రేవంత్ ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ఐటి అధికారులు పదే పదే ప్రశ్నించాయి. మూడు రోజుల సెర్చ్‌ వారంట్‌తో ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు గురువారం రేవంత్‌ రెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో 15 చోట్ల సోదాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 3వ తేదీన విచారణకు రావాలని రేవంత్‌కు నోటీసు ఇచ్చారు. అందులో బషీర్‌బాగ్‌లోని ఆయకార్‌ భవన్‌లో అధికారుల ఎదుట విచారణ ఉంటుందని, దానికి హాజరు కావాలని సూచించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సోదాల్లో రేవంత్‌ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న విషయాన్ని పక్కనబెట్టి…. ‘ఓటుకు నోటు’ కేసుపైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. ఆ కోణంలోనే ప్రశ్నలు సంధించారు. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షల వ్యవహారమే కేంద్రంగా మొత్తం సోదాలు, విచారణ సాగాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ (అప్పట్లో రేవంత్‌ టీడీపీలో ఉన్నారు) నిధులా? పార్టీ ఫండ్‌ నుంచి వాడారా? మరెవరి నుంచి వచ్చింది? కమ్మ సామాజిక వర్గ ‘ముఖ్య నేత’ నుంచి తీసుకున్నారా? మీ చేతికి ఎవరిచ్చారు? వంటి ప్రశ్నల వర్షం ఐటి అధికారులు కురిపించారు. అందుకే, ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షల బ్యాగ్‌ను పట్టుకున్నట్లు భావిస్తున్న ఉదయసింహను రేవంత్‌ ఇంటికి తీసుకొచ్చి…. అదే 50 లక్షల గురించి ప్రశ్నించారు. ఈ సమాచారాన్ని రాబట్టడానికే ఐటీ అధికారులు రోజులు, గంటల తరబడి ప్రయత్నించారు. సోదాల సందర్భంగా రేవంత్‌ ఇంట్లోకి బయటి వ్యక్తులను ఎవరినీ అనుమతించలేదు. రేవంత్‌, కుటుంబ సభ్యుల ఫోన్లను కట్‌ చేశారు. కానీ.. ఐటీ అధికారులు మాత్రం నిరంతరాయంగా ఫోన్లలో (స్పెషల్ నెట్ వర్క్ ద్వారా) మాట్లాడుతూనే ఉన్నారు. అవతలి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే..(?) సోదాలు జరిపారు. ఇదే విషయాన్ని రేవంత్‌ కూడా ఆరోపించారు.
సోదాల వెనక ఉద్దేశం ‘ఓటుకు నోటు కేసు’ అని చెప్పడానికి మరో కారణాన్ని కూడా అధికార వర్గాలు వివరిస్తున్నాయి. సెబాస్టియన్‌, ఉదయసింహ ఇళ్లలో కూడా సోదాలు జరిపిన ఐటీ అధికారులు వారిని అక్టోబరు 1న ఆయకార్‌ భవన్ లో విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. వారి నుంచి సమాచారాన్ని రాబట్టిన తర్వాత.. దాని ఆధారంగా రేవంత్‌ను ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే ఆయనను అక్టోబరు 3న హాజరు కావాల్సిందిగా నోటీసు ఇచ్చారు. అప్పుడు కూడా ‘రూ.50 లక్షలు’ చుట్టూనే ప్రశ్నలు సంధించనున్నట్లు భావిస్తున్నారు. ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఓటుకు నోటు కేసును తక్షణమే తేల్చాలన్న కేంద్రం ఒత్తిడితో రేవంత్‌ను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

విచారణకు వచ్చిన కొండల్‌రెడ్డి, ఉదయ్‌సింహ.. మెల్లగా సెబాస్టియన్‌:
తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి, ఉదయ్‌సింహా ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. గత బుధవారం రేవంత్‌రెడ్డితో పాటు, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. విచారణకు హాజరుకావాలని సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ, కొండల్‌రెడ్డిలకు అధికారులు ఆ సమయంలో నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా సోమవారం బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయంలో విచారణకు కొండల్‌రెడ్డి, ఉదయ్‌సింహా హాజరయ్యారు. వీరిని పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. వారి నుంచి ఎలాంటి సానుకూల సమాచారం రాలేదని తెలిసింది. అనంతరం సెబాస్టియన్‌ కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన ఓ ప్రణాళిక ప్రకారం అధికారులకు చెప్పాల్సినదంతా చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఉదయ్ సింహ బంధువు
ఉదయ్ ప్రతాప్ ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు ఎల్.బి.నగర్ పోలీస్టేషన్ లో పిర్యాదు అందింది. ఇంట్లో దస్తావేజులను తీసుకువెళుతూ.. ఐటి అధికారులమని చెప్పనట్లు తెలిసింది. ఐటి అధికారులు మాత్రం ఆ సంఘటనతో తమకు సంబంధం లేదని చెపుతున్నారు. ఈనెల 3వ తేదీన ఐటి అధికారుల ముందు హాజరుకానున్న రేవంత్ రెడ్డి ని విచారణతో సరిపుచ్చుతారా..? అరెస్ట్ చేస్తారా..? అనే విషయంపై అధికారులు నోరు పెదమటంలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close