నన్నెందుకు చూపించరు?

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): టీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మరోసారి మీడియాపై పడ్డారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మీడియా సంస్థ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తూనే ఉంది. అత్యధిక మీడియా చంద్రబాబును భుజాన మోస్తోందన్నది బహిరంగ రహస్యమే. అయితే రేవంత్‌ రెడ్డి మాత్రం తమను సరిగా చూపించకుండా కేవలం అధికార టీఆర్‌ఎస్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న చానళ్లపై, పత్రికలపై ఏకంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌ చానల్‌తో పాటు, టీవీ9, 10టీవీలకు వ్యతిరేకంగా సీఈవో రజత్‌కుమార్‌ను కలిసి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయా మీడియా సంస్థలు కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ప్రచారం కల్పిస్తున్నాయని ఆరోపించారు. కాబట్టి సదరు మీడియా సంస్థలపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్‌కి సైతం ఫిర్యాదు చేశామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here