ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడి రాజీనామా

0

వాషింగ్టన్‌ : ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలానికి మూడేళ్లు ముందే ఆయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ వెల్లడించారు. ప్రపంచ సంస్థకు అధ్యక్షుడిగా ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, పేదరికం నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినట్లు కిమ్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతున్న దశలో ప్రపంచ బ్యాంక్‌ సేవలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. కిమ్‌ ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా 2012లో తొలిసారి బాధ్యతలు స్వీరించారు. 2017లో రెండోసారి ఎన్నికై కిమ్‌ పదవీ కాలం 2022 వరకు ఉంది. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. కాగా, ప్రపంచ బ్యాంకు ప్రస్తుత సిఇఒ క్రిస్టాలినా జార్జియేవా ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాధ్యతలను స్వీకరించనున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here