లోక్‌సభలో రిజర్వేషన్‌ దుమారం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అగ్ర వర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసే బిల్లుపై లోక్‌సభలో వాడీ వేడి చర్చ జరిగింది. ఈ బిల్లుపై విపక్షాలు ఆందోళనలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లా డుతూ.. రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బిల్లు ద్వారా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే మా ఈ ప్రయత్నం అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకురావాలన్నదే ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లుకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదన్నారు. ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ అన్న అంశాన్ని 15వ అధికరణ క్లాజ్‌(5) సవరణ సమయంలోనే చేర్చారు. అదే ప్రకారం ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించాలని ప్రయత్ని స్తున్నాం. పీవీ హయాంలో ప్రత్యేక చట్టం ఏవిూ చేయలేదు.. అందుకే కోర్టు కొట్టివేసింది. చాలా మంది రిజర్వేషన్లు 50శాతం దాటితే కోర్టు కొట్టివేస్తుందని అంటున్నారు. ఆ ఆందోళన నిజమే అయితే ఇప్పటివరకు రిజర్వేషన్లకు ఆర్టికల్‌ 15, 16 కల్పించిన వెసులుబాటులే మూలం. ఆర్టికల్‌ 16(4)లో కులాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రస్తావన ఉంది అని జైట్లీ వెల్లడించారు. అయితే ఇక్కడ ఆర్థిక వెనకబాటు కాబట్టి కులాలతో సంబంధం లేదన్నారు. అందువల్ల న్యాయపరమైన చిక్కులకు అవకావం లేదన్నారు. 124వ రాజ్యంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి థావర్‌చంద్‌ గ¬్లత్‌ చర్చను ప్రారం భించారు. ఈసందర్భంగా గ¬్లత్‌ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లు కాకుండా వేర్వేరు మార్గాల్లో వారికి ఊరట కలిగించే ప్రయత్నాలు జరిగాయి. ఆర్థిక స్థోమత లేక రిజర్వేషన్ల పరిధిలోని రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక సమానత్వం కోసమే ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. ‘సబ్‌ కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ నినాదం పరిపూర్ణం చేయడానికి ఈ బిల్లును తీసుకొచ్చాం. రాజ్యాం గంలోని 15వ అధికరణకు క్లాజ్‌ (6) జోడించేందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. ఆర్థిక వెనుకబాటు అనే అంశాన్ని రాష్ట్రాలు ఎప్పటికప్పుడు నిర్ణయించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఈ రిజర్వేషన్లు వర్తించవని వెల్లడించారు. 124వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో 2/3 వంతు మెజారిటీ అవసరం.బిల్లును జేపీసీకి పంపాలి: కేవీ థామస్‌ ఈ చర్చలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీ థామస్‌ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఈ బిల్లును జేపీసీకి పంపి సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఏ తొందరపాటు నిర్ణయమైనా అనేక సమస్యలకు దారితీస్తుంది. పీవీ హయాంలో మొదటిసారి ఆర్థిక వెనుక బాటు ఆధారంగా రిజర్వేషన్లు తెచ్చారు. కానీ ఆ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం చాలా తొందరపాటుగా వ్యవహరిస్తోంది. ఆ అనుభవం దృష్ట్యా ఇందులో ఎన్నో చట్టప రమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. అసలు ఈ దేశంలో ఉద్యోగ కల్పన ఎక్కడ ఉంది? ఈ ప్రభుత్వం ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హావిూ ఇచ్చింది. ఐదేళ్లలో పదికోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉంది.. ఈ ప్రభు త్వానికి ఇంకా 3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇంత తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here