Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

పునర్జన్మ పరిశోధన కేంద్రాలు..!

కోట్లు కుమ్మరిస్తున్న విదేశీయులు

  • భారత్‌ లో కర్మ సిద్దాంతం
  • ఈజిప్టులో ‘మమ్మీ’ సంస్కృతి
  • ఏకంగా సమీక్షలు

(హిస్టరీలో మిస్టరీ కథనం-6)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

పునర్జన్మ ఎప్పుడూ ఎవరికీ అర్థంకాని.. అద్భుతమైన కాన్సెప్ట్‌. హిందూమతంతో పాటు, ఇతర సంస్కృతులు కూడా ఒక వ్యక్తి మళ్లీ, మళ్లీ ఈ భూమ్మీద పుడతారని చెబుతాయి. ఉదాహరణకు బుద్దిజం కూడా పునర్జన్మను నమ్ముతుంది. మరణం తర్వాత జీవితం, పునర్జన్మ గురించి ఈజిఫ్టియన్స్‌ లో చాలా ధృడమైన నమ్మకం ఉంది. వారి జీవన సంస్కృతిలో పునర్జన్మ ఓ భాగంగా భావించుకున్నారు. మరణం తర్వాత మరో జన్మ ఉంటుందా..? హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు చక్కటి ఉదాహరణ శ్రీ మహావిష్ణువు. మనిషి రూపంలో.. అనేకసార్లు జన్మించారు. అందుకే ‘దశావతారాలు’గా భూమ్మీద ఉండే దుర్మార్గులను నాశనం చేయడానికే విష్ణువు అన్ని సార్లు పునర్జన్మ పొందారని విశ్వాసం. అయితే ఈ పునర్జన్మ గురించి చాలా మందిలో అపనమ్మకం ఉంది. అది సాధ్యం కాదన్న భావం ఉంది. అయితే.. పునర్జన్మ గురించి.. కొన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, అద్భుతమైన వాస్తవాలున్నాయి. పునర్జన్మ గురించి ఏకంగా పరిశోధన కేంద్రాలు ఉన్నాయంటే నమ్మరు కదా ..! చదవండి.

ప్రముఖులే.. కానీ..:

పునర్జన్మ కర్మ సిద్ధాంతాలు నమ్మిన వారిలో సుప్రసిద్ధ వ్యక్తులున్నారు. టి.హెచ్‌.హక్సలీ 1893లో పరిణామం నీతి గురించి చెబుతూ వంశపారంపర్యంగా కొన్ని పరిణామాలు రావడం కర్మ సిద్ధాంతం వంటిదన్నాడు. ఇంకేముంది? హక్సలీ సైతం పునర్జన్మను అంగీకరించాడన్నారు!

పునర్జన్మను నమ్మిన ఎఫ్‌.డబ్ల్యు.హెచ్‌.మైర్స్‌, అనిబిసెంట్‌, బ్లావట్స్‌ రాసిన విషయాలు, ప్రొఫెసర్‌ జి.ఆర్‌.మల్కాని-ప్రొఫెసర్‌ వారెన్‌ స్టెయిన్‌ క్రాస్‌ మధ్య ఫిలసాఫికల్‌ క్వార్టర్లీ(1965)లో జరిగిన చర్చను ఇక్కడ ఉదహరించవచ్చు. కొన్ని మార్మిక విషయాలు మనకు తెలియవని, చర్చించరాదని మల్కాని అన్నారు.

పునర్జన్మలు కర్మ ప్రకారం వస్తాయని అనిబిసెంట్‌ నమ్మినా, ఉత్తరోత్తరా జన్మలకు తగిన దేహాలను ఎలా వెతికి తెస్తారో చెప్పలేక పోయారు.

తార్కికంగా గాని, శాస్తీయంగా గాని, కర్మ నిలబడదు. ఈ విషయంలో ప్రాచ్యపాశ్చాత్య సిద్ధాంతకారులను పాల్‌ ఎడ్వర్డ్స్‌ పరిగణనలోకి తీసుకున్నారు. ఎ.జె.అయ్యర్‌ వంటి బ్రిటిష్‌ తాత్వికుల భావాలు కూడా ప్రస్తావించారు.

ఈ ముదురు బెనర్జి మనోడే..:

పూర్వజన్మల గురించి ఇండియాలో కొన్నేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన హెచ్‌.ఎన్‌.బెనర్జి గురించి చూదాం. బెనర్జి అమెరికాలో కూడా కొంత ప్రచారం పొందాడు. ఒక పునర్జన్మ కేంద్రం కూడా నెలకొల్పి, మూసేశాడు. ఏన్‌ మిల్లర్‌ అనే సినీతార పూర్వజన్మలో ‘ఈజిప్టు రాణి హత్సెసుట్‌’ అన్నాడు. అతడి పుస్తకాలు డబుల్‌ డే ప్రచురణకర్తలు కూడా వెలువరించారు. తరువాత బెనర్జిని ఇండియాలో అరెస్ట్‌ చేశారు. అతడివన్నీ కట్టుకథలని తేలింది. యుజిసి కూడా కొంత నిధిని సమకూర్చి తరువాత నాలుక కొరుకుంది.

అమెరికాలో..:

అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అమెరికాలో ఏకంగా 14 కేంద్రాల్లో పునర్జన్మ పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్‌ లో అరెస్టైన బెనర్జీ

ఓక్లొహామా రాష్ట్రంలో షోఫెన్‌ బర్గ్‌ రీసెర్చి ఫౌండేషన్‌ పెట్టి… మూసేశాడు.

వీళ్ళు ఇంకా నమ్ముతున్నారు:

బౌద్ధులకు గత జన్మలు తెలుస్తాయని టిబెట్‌ లో నమ్ముతారు. ఆఫ్రికా ప్రాంతాల్లోని తెగలు పునర్జన్మలకు సంబంధించి అనేక నమ్మాకాలతో ఉన్నారు.

మనిషి చావంటే భయం. అందుకే తన ఎదురుగా చచ్చిన వాడు ఒక్కడూ బతకటం చూడలేదు. అయితే పూర్వజన్మ ఉంటుందనే ఆశ, ఆ అశకు కర్మ సిద్దాంతం, దాని ఆధారాలకోసం ఏకంగా ప్రయోగశాలలో పరిశోధనలు. మనిషికి పునర్జన్మ ఉంటే మన రాజకీయులు ఎంత పెట్టి అయినా ఏంచక్కా ఏడు తరాలకు సరిపోను పునర్జన్మలను బుక్‌ చేసుకోరూ…..! చివరిగా..పునర్జన్మ కేంద్రాలలో ఎలా..! ఎవరు..? ఏ దిశలో పరిశోధనలు చేస్తున్నారో ఎవరికీ తెలియని హిస్టరీలో మిస్టరీ.

ఏమిటో ఈ సదస్సు:

గత కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా ‘మెరీనా డెల్‌ రే’లో పునర్జన్మలకు సంబంధించిన ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సదస్సులో జరిగిన వివరాలు బయటకు పొక్కలేదు కానీ… పాల్గొన్న వారి దగ్గర భారతీయ మారకంలో ఓ కోటిన్నర వరకు ఫీజు రూపంలో వసూలు చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అందులో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనటం.

పునర్జన్మకు ఈ ఊహలే ప్రాణం:

1.ఆత్మ బతికే ఉంటుంది హిందూ సిద్ధాంతం ప్రకారం ఆత్మ నాశనం కాదు. శరీరం మరణించినా.. ఆత్మ బతికే ఉంటుంది. బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుంది.

2.కర్మను బట్టి ఆత్మ ప్రవేశం ఆత్మ వెళ్లే కొత్త శరీరం అనేది మనం మన పూర్వ జన్మలోని మన కర్మను లేదా మనం చేసిన మంచి, చెడు పనులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి మంచి పనులు చేసి, మంచి కర్మ పొంది ఉంటే.. ఆత్మ మళ్లీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి చెడు పనులు చేసి, చెడు కర్మను పొంది ఉంటే.. అతని పునర్జన్మ దానికి ఫలితంగా అనుభవించాల్సి ఉంటుంది.

3.జంతువులుగా కూడా జన్మించే అవకాశం ఉంది. చాలా వరకు మనుషులు పునర్జన్మ మనిషి రూపంలోనే జన్మిస్తాడు. కానీ.. కర్మను బట్టి కొన్నిసార్లు జంతువుగా కూడా జన్మించే అవకాశం ఉంది.

4.ఆత్మ ‘దయ్యం’గా మారుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి చాలా తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోయి ఉంటే.. అతను లేదా ఆమె దయ్యం అవుతారు. తనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చిన తర్వాత పునర్జన్మ పొందుతారు.

5.అంత్యక్రియలు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనక కూడా కారణం ఉంది. ఎందుకంటే.. మరణం తర్వాత అతనికి ఈ జన్మ గురించి ఏమీ గుర్తుండకూదని.. దేహాన్ని కాల్చడం, లేదా పూడ్చడం ద్వారా అంత్యక్రియలు హిందువులు నిర్వహిస్తారు. దీనివల్ల ఆత్మ మళ్లీ.. ఈ పాత జ్ఞాపకాల కోసం వెతుక్కోకుండా..మరో జన్మ పొందడానికి ఇలా చేస్తారు.

6) ఏడు జన్మలు ప్రతి మనిషి ఏడు సార్లు ఇలా పునర్జిన్మంచడానికి అవకాశం ఉంటుంది. శారీరకంగా మగవాళ్లు, ఆడవాళ్లు మాదిరిగానే ఏడు సార్లు జన్మిస్తారు. అయితే వాళ్లు చేసిన మంచి, చెడు పనులను బట్టి.. వాళ్ల తర్వాత జన్మ ఆధారపడి ఉంటుంది

7.అనుకూల పరిస్థితుల్లో ఆత్మ ప్రవేశం మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చనిపోయిన వెంటనే.. ఆత్మ మరో శరీరరంలోకి ప్రవేశించదు. కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత.. కొత్త శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుంది.

8.పూర్య జన్మ గురించి మహర్షుల ప్రకారం.. మన గత జన్మ గురించి ప్రతీది మనకు గుర్తు ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే.. పూర్వ జన్మ గురించి గుర్తు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే.. మన పూర్వ జన్మల గురించి మన ‘అన్‌ కాన్సియస్‌ మైండ్‌ లో రికార్డ్‌’ అయి ఉంటాయన్నమాట.

ఈజిప్టులో మమ్మీలు… ఇలా భద్రపరుస్తారు..:

పునర్జన్మ విషయంలో భూమ్మీద ఈజిప్టులో ఉన్నంత నమ్మకం ఎవరికీ ఉండదేమో. చనిపోయిన వాళ్లు ఆత్మ రూపంలో తిరిగి వస్తారనీ, తమ డెడ్బాడీ (శవాల) దగ్గరకు వస్తారని ఈజిప్షియన్లు నమ్మేవారు. అందుకే చనిపోయిన వాళ్లను మమ్మిఫికేషిన్‌ చేసేవాళ్లు. ఒక్కో శవాన్ని మమ్మీగా మార్చడానికి 70 రోజులు పడుతుంది. మనిషి చనిపోయాక… శరీరంలో కుళ్లిపోయే అవయవాల్ని తొలగించి… కొన్ని లేపనాలు, సెంట్లను పోసేవారు. ఆ శవాన్ని తెల్లటి వస్త్రాలతో చుట్టేవారు. ఇలా 70 రోజులపాటూ ఎండిపోయే శవంలో నీరు మొత్తం ఇంకిపోయేది. దాన్ని బాక్సులో ఉంచి… సదరు వ్యక్తి వాడిన వస్తువుల్ని, ఆర్థిక స్థోమతను బట్టి బంగారం అందులో పెట్టి… పూడ్చిపెట్టేవారు. ఇటీవలే ఓ 53.మమ్మీలు వెలుగు చూశాయి. హైదరాబాద్‌ లో కూడా మమ్మీ ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close