బిజినెస్

కార్‌పూల్‌, బైక్‌పూల్‌ సేవలను ప్రారంభించిన రెడ్‌బస్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణీకుల కోసం రెడ్‌బస్‌ అందుబాటులోకి తీసుకువచ్చిన కార్‌పూల్‌, బైక్‌పూల్‌ సేవలను రెడ్‌బస్‌ సీఈఓ ప్రకాశ్‌ సంగమ్‌ ఇతర ప్రతినిధులు సమక్షంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎన్‌విఎస్‌ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైల్లో నిత్యం ప్రయాణించే ప్రయాణీకులకు మొదటి నుంచి చివరి మైలు వరకు అనుసంధానాన్ని కల్పించేందుకు రెడ్‌ బస్‌ తన ఇన్‌ యాప్‌ రైడ్‌ షేరింగ్‌ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సేవలను సహకరిస్తాయని పేర్కొన్నారు. రహదారులపై వాహన రద్దీ సమస్యలను తగ్గించేందుకు కార్‌ పూలింగ్‌, బైక్‌ పూలింగ్‌ అత్యుత్తమ పరిష్కారమని ఆయన అన్నారు. తమ నివాసం, కార్యాలయాల మధ్య ప్రయాణించే సమయంలో ప్రయాణీకులు తామే సొంతంగా నడుపుకునేందుకు అనువుగా తమ సొంత కార్లు బైక్‌లలో ప్రయాణించేందుకు సంస్థ అవకాశం కల్పిస్తుందన్నారు. నగరంలో వృద్ది చెందుతున్న వాహన రద్దీ సమస్యలకు ఈ విధానం సుస్థిరమైనా, పర్యావరణానికి మేలు చేసే పరిష్కరణలను అందించేందుకు సహకరిస్తుందన్నారు. రెడ్‌బస్‌ సిఈఓ ప్రకాష్‌ సింగం మాట్లాడుతూ నగరాల్లో ప్రయాణానికి సుస్థిరమైన పరిష్కారాలను అందించాలన్న తపన ఇటువంటి వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కారణమైందన్నారు. రెడ్‌బస్‌తో మెట్రో రైల్వేస్టేషన్ల నుంచి కార్‌పూలింగ్‌ అందుకునే వారిని ప్రోత్సాహించే దిశలో ఎల్‌ అండ్‌ టిఎంఆర్‌హెచ్‌ఎల్‌తో చేసుకున్న ఒప్పందాలు ఎండ్‌ టు ఎండ్‌ కనెక్టివిటీని క్రమబద్దీకరించేందుకు అవకాశం కల్పించడం ఈ దశలో భాగంగా ఉంటుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి, ఎల్‌ అండ్‌ టి సిఎంఓ రిషివర్మ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ డివిఎస్‌.రాజు, రెడ్‌బస్‌ మార్కెటింగ్‌ హెడ్‌ పల్లవి చోప్రా, రెడ్‌బస్‌ ఇంజనీరింగ్‌ ఉపాధ్యక్షుడు ఫనీష్‌ గురురాజ్‌ తదితరులు పాల్గన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close