Featuredటెక్నాలజీరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

చంద్రుడిపై ‘రియల్‌ ఎస్టేట్‌’

అమెరికా కంపెనీ ఆన్‌ లైన్‌ వ్యాపారం

  • కొనుగోలు చేసిన భారతీయులు
  • ఇదో రకం ఘరానా మోసం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

మానవుడు ఒకవైపు శాస్త్రీయ, సాంకేతికంగా వేగంగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు అదేస్థాయిలో నేరాలు ఘోరాలు దూసుకెళుతున్నాయి. 1756లో మొదలైన చంద్రుడిపై ‘ఊహల కబ్జా’ ఉదంతాలు అడపాదడపా దశాబ్దానికి ఒక్కో కోణంలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ఓ కొత్తరకం ఘరానా మోసం వెలుగుచూసింది. ఇది అమెరికా కేంద్రంగా 16ఏళ్ళ క్రితం దగా వ్యాపారం మొదలైంది. అదీ చంద్రుడుపై ప్లాట్ల అమ్మకం పేరుతో. ఇందులో సినీ నటులు, ప్రముఖ వ్యాపార,పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇంతకీ చంద్ర మండలం ఎవరిది?:

ఇంతకూ చంద్ర మండలంపై స్థలం కొనుక్కోవచ్చా? అమ్మడానికైనా, కొనడానికైనా చంద్ర మండలం ఎవరిదైనా అయ్యుండాలి కదా? మరి ఇది ఎవరిది? చంద్ర మండలంపై స్థలాలు, అనేక ఖగోళ పదార్థాలను అమ్ముతామనే వెబ్సైట్లు చాలా ఉన్నాయి. లూనార్‌ రిజిస్ట్రీ, లూనార్‌ ల్యాండ్‌ అనే రెండు కంపెనీలు చంద్రుడిపై ప్లాట్ల వ్యాపారం జోరుగా కొనసాగిస్తోంది. ఈ సంస్థలు కొనుగోలుకు సంబంధించి సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. ఏ వెబ్సైట్‌ చూసినా తమదే చట్టబద్ధమైనదని చెప్పుకొంటోంది. ఇవన్నీ సంపాదన కోసమేనని తెలుస్తుంది. ఈ సంస్థలు విక్రయించిన ఇతర గ్రహాలలో ఉన్న 2.66 మిలియన్‌ ఎకరాలను 45,000 డాలర్లకు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా విక్రయించాయి. తమ సొత్తుగా ఏకంగా లేఅవుట్లు సైతం మరో విశేషం. ఎకరం 29.99 డాలర్లుగా ధర కూడా నిర్ణయించి అమ్మకాలను ఆన్‌ లైన్‌ లో సాగిస్తున్నారు.

కొనుగోలు చేసిన వారిలో..:

బాలీవుడ్‌ నటులు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుట్‌, షారుఖ్‌ ఖాన్‌ లకూ చంద్రమండలంపై స్థలం ఉంది. సుశాంత్‌ సింగ్‌ సొంతంగా కొన్నారు. షారుఖ్కు బహుమతిగా వచ్చింది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త రాజీవ్‌ భాగ్డి చంద్రునిపై 5 ఎకరాలభూమిని కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు ధ్రువీకరిస్తున్నట్లుగా ఆయన వద్ద కొన్ని పత్రాలు ఉన్నాయి. 2003లో 140 అమెరికా డాలర్లు (రూ. 9,662/-లు) చెల్లించి ఆన్లైన్లో ఆయన చంద్రుడిపై ప్లాట్‌ కొన్నారు. చంద్రుడిపై మేర్‌ ఇంబ్రియం ప్రాంతంలో రాజీవ్కు ప్రాపర్టీ ఉంది. అమెరికాలో న్యూయార్క్‌ నగరంలోని ‘లూనార్‌ రిజిస్ట్రీ’ వద్ద ఇది రిజిస్టర్‌ అయినట్లు దృవపత్రాలు ఉన్నాయి. అరబ్‌ దేశంలో స్థిరపడిన మళయాళి మనికందన్‌ మిల్లోత్‌ పది ఎకరాలు కొనుగోలు చేశాడు.

మాకు హక్కులు ఇవ్వరూ..!:

చంద్రుడిపై స్థల హక్కులు కల్పించాలని ‘స్పేస్‌ సెటిల్‌ మెంట్‌ ఇనిషియేటివ్‌’ సంస్థ డిమాండ్‌ చేస్తుంది. భారీ పెట్టుబడికి సైతం తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు.

అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం:

1967లో ఐక్యరాజ్యసమితిలో ‘ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ’ని ఆమోదించారు. భారత్‌ సహా 100 దేశాలు దీనిపై సంతకం పెట్టాయి. చంద్ర మండలం, ఇతర ఖగోళ ప్రదేశాలు సహా అంతరిక్ష అన్వేషణ, వినియోగంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఈ ఒప్పందం నిర్దేశిస్తుంది. ఒప్పందంలోని అధికరణ 1 ప్రకారం… అంతరిక్షం, చంద్ర మండలం, ఇతర ఖగోళ ప్రదేశాలపై అన్వేషణ (పరిశోధన) అన్ని దేశాల ప్రయోజనం కోసమే చేపట్టాలి. ఎలాంటి పక్షపాతం, వివక్ష లేకుండా ఇవి అంతర్జాతీయ చట్ట పరిధిలో అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిపై శాస్త్ర పరిశోధనలో దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. అంతేకానీ ఈ గ్రహాలకు సంబంధించి ఎలాంటి వ్యాపారాలు నిర్వహించరాదు.

కొన్నవాళ్ళ పరిస్థితి..?:

మాకు భూవ్మిూద మాత్రమే కాదు ఇతర గ్రహాలపై కూడా భూమి ఉందని చెప్పుకొని మురిసే అవకాశం మాత్రం ఉంది. కానీ ఆ లావాదేవీలకు ఆ కాగితం పాటి విలువ కూడా ఉండదు. పాపం మోసపోయోవాడు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు.

ఈ పిచ్చి 1756 నుంచే:

1756లో జర్మనీలోని ప్రష్యా చక్రవర్తి జుర్గెన్స్‌ పితృస్వామ్యానికి కృతజ్ఞతా సంజ్ఞగా చంద్ర ఉపగ్రహాన్ని ప్రదానం చేశాడు. అది తన కుమారులకు అందజేయాలని నిర్దేశించినప్పటి నుండి చంద్రుడు కుటుంబ ఆస్తి అని వారు అంటున్నారు. కానీ, 250 సంవత్సరాలలో జుర్గెన్స్‌ యాజమాన్యం గురించి అక్కడక్కడా చర్చ ఉంది. 1936లో ఎ.డీన్‌.లిండ్సే అనే వ్యక్తి చంద్రుడిని మాత్రమే కాకుండా అన్ని ఖగోళ వస్తువులను క్లెయిమ్‌ చేసి, వాటిని జార్జియాలోని ఒసిల్లాలోని ఇర్విన్‌ కౌంటీ కోర్టులో నమోదు చేశాడు. 1949లో, పబ్లిక్‌ టి.వర్కర్‌ జేమ్స్‌ టి. మంగన్‌ అనే స్వయం సహాయక రచయిత లిండ్సే జాబితాలో లేని ప్రతిదానికీ దావా వేశారు. మంగన్‌ 74 దేశాల రాష్ట్ర కార్యదర్శులకు ‘నేషన్‌ ఆఫ్‌ ఖగోళ స్థలం’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి మరీ లేఖలు కూడా రాశాడు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close