ఏపీ అభివృద్ధిపై బాబు చర్చకు సిద్ధమా?

0

జీవితంలో ఎప్పుడూ లంచం

 తీసుకోవద్దు

˜ తల్లితో గడిపిన క్షణాలను

 గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ

విజయనగరం (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఏపీ అభివృద్ధి, విభజన హావిూలపై.. చంద్రబాబు చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సవాల్‌ విసిరారు. ఎన్డీఏ హయాంలోనే ఏపీకి భారీగా నిధులు కేటాయించామని, ఎంత చేసినా బీజేపీ ఏవిూ చేయలేదంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్‌ షా విజయనగరంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు.. చంద్రబాబు టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. విభజన హావిూల్లోని కీలకమైన 14అంశాల్లో.. 10 అంశాలను అమలు చేశామన్నారు. 2014కు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ఆంధప్రదేశ్‌కు ఇచ్చింది రూ.లక్షా 17వేల కోట్లు అని, 2014 తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇచ్చింది రూ.2లక్షల 44వేల కోట్లు అని అన్నారు. నిధులన్నీ కలిపి.. రూ.5లక్షల 56కోట్లు అందించామని షా తెలిపారు. రాష్ట్రానికి రూ.5లక్షల56వేల కోట్లు ఇచ్చిన బీజేపీ మంచిదా.. రూ.లక్షా 17వేల కోట్లు ఇచ్చిన కాంగ్రెస్‌ మంచిదా చంద్రబాబు చెప్పాలని అమిత్‌షా ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి కృషిచేసిన ఎన్డీఏను ఎందుకు వదిలేశారో సమాధానం ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఏపీకి 20 జాతీయ సంస్థలను మంజూరు చేశామని, ఇప్పటికే ఐఐటీ, ఐఐఎంలు ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్‌ నిర్మాణం కూడా జరుగుతోందని, ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని అమిత్‌షా అన్నారు. ఇక్కడ జరుగుతున్న అవినీతికి.. ఆయనకు మాత్రమే సంబంధం ఉందని అమిత్‌షా అన్నారు. చంద్రబాబు 14ఏళ్లు అధికారంలో ఉండి రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయగలిగారా అని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రణాళికలు అడిగామని, ప్రత్యేక ¬దాకు మించి నిధులు అందిస్తామని చెప్పామని, ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో చంద్రబాబు స్వాగతించారని, కానీ ప్రణాళికలు మాత్రం ఇవ్వలేదన్నారు. ఇంత సహకారం అందించినా.. చంద్రబాబు అబద్ధాలు చెప్పారని ప్రజలు తెలుసుకున్నారని అమిత్‌షా అన్నారు. అలాగే అమరావతి, పోలవరంలో అవినీతి జరుగుతోందని తెలిసి.. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారన్నారు. రాష్ట్రానికి ఏవిూ చేయడం లేదని అబద్దాలు చెబుతున్నారని, చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనకున్నారన్నారు. దానిని ప్రజలు స్వాగతించే పరిస్థితి లేదని గమనించి చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాతే మహాకూటమి అంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం,

మోదీ ప్రధాని కావడం ఖాయమని అమిత్‌షా తెలిపారు. అప్పుడు చంద్రబాబు మళ్లీ ఎన్డీఏలోకి రావడానికి ప్రయత్నిస్తారని, ఈసారి మాత్రం ఆయన్ను ఎన్డీఏలోకి రానివ్వమని అమిత్‌షా తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని, రెండు పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయంటూ మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై పోరులో భాగంగా బస్సుయాత్ర చేపట్టామని, బీజేపీ మహిళా నేతను కూడా చంద్రబాబు అవమానించారని అమిత్‌షా ధ్వజమెత్తారు. మా పార్టీ నేతల్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని, ఇంటింటికి వెళ్లి మోదీ చేసిన మంచి పనుల్ని ప్రజలకు వివరించండంటూ, బీజేపీ సహకారం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదని, ఆ దిశగా.. నేతలు, కార్యకర్తలు పని చేయాలి అమిత్‌షా పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here