స్పోర్ట్స్

గంగూలీ, సచిన్‌, లారా… రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధం

ముంబయి: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో తలపడే మ్యాచులో మరో 46 పరుగులు చేస్తే 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అత్యంత వేగంగా దీనిని సాధించిన మూడో క్రికెటర్‌గా ఈ ఘనతను అందుకుంటాడు. సచిన్‌ తెందుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, బ్రియన్‌ లారా వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టనున్నాడు. ప్రస్తుతం రోహిత్‌ 215 ఇన్నింగ్సుల్లో 8,954 పరుగులతో ఉన్నాడు. 9000 మైలురాయిని అందుకొనేందుకు గంగూలీ 228, సచిన్‌ 235, లారా 239 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. రాజ్‌కోట్‌లో గనక హిట్‌మ్యాన్‌ ఆ 46 పరుగులు చేస్తే విరాట్‌ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్‌ (205) తర్వాతి స్థానంలో నిలుస్తాడు. 2019లో అతడు వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. ఏకంగా 7 శతకాలు బాదాడు. అందులో ఐదు ప్రపంచకప్‌లోనే సాధించాడు. ఆ ఏడాదికి వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుడి రికార్డూ అందుకున్నాడు. తాజాగా ఐసీసీ అతడికి ‘వన్డే క్రికెటర్‌’ వీరతాడు వేసిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్‌లో రోహిత్‌ శతకం బాదితే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు 28 సెంచరీలతో సనత్‌ జయసూర్య సరసన ఉన్నాడు. ముంబయి వన్డేలో విఫలమైన అతడు ఈ మ్యాచులో ఏడు సిక్సర్లు బాదితే అన్ని ఫార్మాట్లలో ఆసీస్‌పై 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా సంచలనం స ష్టిస్తాడు. కంగారూలపై విరాట్‌, రోహిత్‌ కలిసి ఇప్పటి వరకు 991 పరుగులు చేశారు. వీరిద్దరూ శుక్రవారం మ్యాచులో 9 పరుగులు చేస్తే ఆసీస్‌పై 1000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఐదో జంటగా ఘనత అందుకుంటారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close