Featuredవిద్యస్టేట్ న్యూస్

పేదోడి చదువు భారం…

కార్పోరేట్‌ విద్య భద్రం…

మూతపడనున్న ప్రభుత్వ పాఠశాలలు…

కళకళలాడనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు…

అందరికి చదువు అందాలనే ఆలోచన మారిపోతుంది.. చదువు డబ్బున్నోడికే అందాలి… అది కూడా కార్పోరేట్‌ పాఠశాలలో మాత్రమే భద్రంగా దొరుకుతోంది.. పేదవిద్యార్థులు చదువుకునే పాఠశాలలో ఇప్పటికి తాగడానికి గ్లాస్‌ ఉంటే

నీళ్లు ఉండవు. నీళ్లు ఉంటే కుండ ఉండదు.. పిల్లలతో కళకళలాడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి కనీస సదుపాయాలు ఉండవు.. అసలు బడిలో జరుగుతున్నదేమిటో, సౌకర్యాలేమిటో పట్టించుకుందామనే ఆలోచన ఏ ఒక్కరూ

చేయరు. అందుకే పాఠశాలలు ఎక్కువుంటే లేని పోని ఇబ్బంది. ప్రతిపక్షాలకు అణకువ అవుతాము, ప్రజల్లో గుర్తింపు కొల్పతామని భావించి చిన్నా, చితకా గ్రామాల్లో ఉన్న వేలాది పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం రంగం

సిద్దం చేస్తుంది.. విదేశాలకు వెళ్లాము, పక్క రాష్ట్రాల్లోని పాఠశాలలను పరిశీలించామని చెపుతున్న ప్రభుత్వయంత్రాంగం అసలు మూసివేతకు సరియైన కారణాలేంటో మాత్రం ఇప్పటికి చెప్పలేకపోతుంది. విద్యార్థులు రావడం లేదు,

తగ్గిపోయారంటున్నారు కాని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించి నిరంతరం పర్యవేక్షణ చేస్తే ఎందుకు విద్యార్థులు తగ్గుతారు, ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు.. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో అనుమతి

లేకుండా నడుస్తున్న వేలాది కార్పోరేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని మూసివేస్తే ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతాయి..కాని ప్రభుత్వానికి అసలు ఆ ఆలోచన ఎందుకు రావడం లేదంటే సగం కార్పోరేట్‌ పాఠశాలలు వారి బినామీ

పేర్లతో నడుస్తున్నవేనని ఆరోపణలున్నాయి.. ఉన్నవాటిని మూసేసి అవకాశాన్ని బట్టి విలీనం చేసేసి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా రవాణా చార్జీలు చెల్లిద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి మన బంగారు

తెలంగాణలో నడవడానికి రోడ్లు లేని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అలాంటప్పుడు వాహనాలు ఏలా వెళతాయి.. విద్యార్థులకు చదువెలా అందిస్తారో అర్థమే కావడం లేదు… విద్యను దగ్గరికి చేస్తున్నారో, మరింత దూరం

చేస్తున్నారో మాత్రం అది మన పాలకులకే తెలియాలి…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

పేదోడి పాఠశాలలు మూతపడుతున్నాయి… బంగారు తెలంగాణలో పాత ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అనుకుంటున్నారో ఏమో తెలియదు కాని ప్రభుత్వం కూడా మూసివేతకే సై అన్నట్లు కనిపిస్తోంది.. ప్రతి పల్లె, ప్రతి తండాలో ఏ

ఒక్క బిడ్డ కూడా చదువులేక ఇబ్బందులు పడకూడదని భావించాల్సిన ప్రభుత్వమే వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సిద్దపడుతోంది.. చాలా గ్రామాల్లో విద్యార్థులు తక్కువుంటే ఉపాధ్యాయులు ఎక్కువున్నారని,

మరికొన్ని పాఠశాలల్లో అసలు విద్యార్థులు లేకున్నా ఉపాధ్యాయులు తూతూ మంత్రంగా నడిపిస్తున్నారనే కారణంగానే మూసివేస్తున్నామని చెపుతున్నారు. మరీ అదే గ్రామాలలో, తండాలలో అనుమతి లేని ప్రవేట్‌ పాఠశాలలెందుకు

విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయంటే మాత్రం సమాధానం దొరకడం లేదు.. అనుమతి లేని ప్రవేట్‌ విద్యాసంస్థలను మూసివేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి విద్యను అందించాల్సిన అంశంపై

ప్రభుత్వంప్రత్యేక దృష్టిసారించాలి కాని ఉన్న స్కూళ్లను మూసివేసి ఒక్కదానిలో విలీనం చేసేసి సుదూర ప్రాంతాలనుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. కాని

అసలు వాహనాలు నడవని గ్రామాలు ఇప్పటికి వేలల్లో ఉన్నాయి.. ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసేసి గ్రామాలలోని విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

కెజీ టూ పిజీకి ఇప్పటికి దిక్కేలేదు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ప్రతి బిడ్డ కేజీ నుంచి పిజీ వరకు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తానని అందరూ చదువుకొని మన బంగారు తెలంగాణను చదువుల తెలంగాణగా

మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్పోరేట్‌ పాఠశాలలు వేలాది, లక్షలాది రూపాయలను మరీ మరీ పీడించి ప్రజలను అప్పుల ఊబిలోకి దింపుతున్నారని మన పాలకులు ఇప్పటికి మాటల వరకే పరిమితమయ్యారు

కాని కార్పోరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోలేదు. ప్రతి పేద విద్యార్థికి ఉచితంగా విద్యను అందించేదీ లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరని ఉన్న కొద్దిమంది విద్యార్థులను దగ్గర్లో ఉన్న పాఠశాలలో చేర్పించి మూసివేయడమే

సరైన ఆలోచనగా కసరత్తులు చేస్తున్నారు. కాని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గడానికి గల కారణాలు మాత్రం తెలుసుకునే ఆలోచననే చేయడం లేదు.

వేలాది ప్రభుత్వ పాఠశాలలకు మూసివేతే..

మన బంగారు తెలంగాణ రాష్ట్రంలో 26.040 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 18.217 ప్రాథమిక పాఠశాలలు, 3.186 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలలు లక్షలాది విద్యార్థులకు విద్యను

అందిస్తున్నాయి. చాలా పాఠశాలలో విద్యార్థులు లేరనే ప్రధాన కారణంతో బడులను మూసివేయడంతో లక్షలాది మంది విద్యార్థులు బజారున పడే అవకాశముంది. ఎంత అవకాశం కల్పించిన రాకపోకలతో విద్యార్థుల అవస్థలు

చెప్పజాలకుండా ఉంటాయి. ప్రభుత్వం చెపుతున్న 2017.18 లెక్కల ప్రకారం 793 పాఠశాలల్లో కనీస నిష్పత్తిలో విద్యార్థులే లేరని తెలుస్తోంది. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులను అక్కడే ఎందుకు

ఉంచారంటే మాత్రం సమాధానం లేదు. రోజురోజుకు చాలా గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నా దానిపై దృష్టిసారించిన దాఖలాలే లేవు. ప్రభుత్వం పాఠశాలలపై అవలంబించే అసమర్థతను కార్పోరేట్‌ విద్యాసంస్థలు

అవకాశంగా మార్చుకొని పల్లెల్లో సైతం తిష్టవేశాయి. అందులో ప్రభుత్వ అనుమతి లేనివే బోలేడుగా ఉన్నాయి వాటిని నియంత్రించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఆలోచన మాత్రం చేయడమే లేదు. స్వంత గ్రామంలోనే

ఉండి బడికి రానివారు వేలల్లో ఉంటే ఉన్నవారిలో బడిని మూసేసి పక్కఊరికి వెళ్లాలంటే ఏలా వెళతారో ప్రభుత్వ ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు కోరుతున్నాయి..

ప్రభుత్వ పాఠశాలల మూసివేత వల్ల విద్య పూర్తిగా కుంటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close