అమృత్‌సర్‌లో ఘోర రైలు ప్రమాదం

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌): పంజాబ్లోని అమృత్సర్లో రావణ దహన వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్‌ ప్రాంతంలోని రైల్వే ట్రాక్కు సవిూపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో ¬వడా రైలు రావడంతో పెను ప్రమాదం జరిగింది. ట్రాక్పై నిలుచుకున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రైలు పఠాన్కోట్‌ నుంచి అమృత్సర్‌ వెళ్తోంది.

ఘటన జరిగే సమయంలో రైల్వే ట్రాక్పై 500 నుంచి 700 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. రావణ దహనంలో భాగంగా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రైలు వారిపై దూసుకెళ్లింది. గాయపడిన క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఎంతో సంతోషంగా దసరా వేడుకలు చేసుకుంటున్న వారు మృత్యు ఒడిలోకి జారుకోవడంతో ఆ ప్రాంతామంతా ఆర్తనాదాలతో దద్ధరిల్లింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బాణసంచా పేలుళ్ల శబ్దాలతో..దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనం చేస్తుండగా.. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ శబ్దాలకు రైల్వే ట్రాక్పై నిల్చున్నవారు అటువైపుగా రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయారు. దీంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రమాదానికి రైల్వే సిబ్బందే కారకులు..రైలు ప్రమాదానికి రైల్వేస్టేషన్‌ అధికారులు, రావణ దహన కార్యక్రమ నిర్వాహకులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైలు వస్తున్న సమయంలో కనీసం ఎటువంటి హెచ్చరికలు చేయలేదని వారు ఆరోపించారు. ఇక్కడ ఏటా దసరా వేడుకలను నిర్వహించడం జరుగుతోంది. అందుకని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే సిబ్బందిని కోరుకుంటాం. కానీ వాళ్లు మాత్రం ఎటువంటి ముందస్తు రక్షణ చర్యలు తీసుకోలేదు’ అని స్థానికులు మండిపడుతున్నారు. దహన కార్యక్రమం జరుగుతుండగా పట్టాలపై వేగంగా రైలు వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

సీఎం అమరీందర్‌ సింగ్‌, కేజ్రీవాల్‌గ్భ్భ్రాంతి..అమృత్సర్లో దసరా వేడుకల్లో జరిగిన రైలు ప్రమాదంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను రక్షించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సహాయం చేయాల్సిందిగా ఆయన కోరారు. జిల్లా అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దిల్లీ సీఎం ఈ ఘటనపై ట్విటర్‌ ద్వారా స్పందించారు. అమృత్సర్‌ ఘటన తనను షాక్కు గురి చేసిందన్నారు. అందరూ స్వచ్ఛందంగా ముందకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఆయన పిలుపు నిచ్చారు. అవసరమైన సహాయం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన’ఆదాబ్‌ హైదరాబాద్‌ న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి’కి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here