వస్త్ర దుకాణాలపై తూనికల శాఖ దాడులు 260 కేసులు నమోదు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దసరా పండుగ నేపథ్యంలో గత వారం గ్రేటర్‌ హైదరాబాద్లో వస్త్ర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన తూనికల కొలతల శాఖ తాజాగా మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో తూనికలు, కొలతల శాఖ ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌ చట్టం 2011లోని వివిధ సెక్షన్లలోని నిబంధనలను పాటించని దుకాణాలపై 260 కేసులను నమోదు చేసింది. మంచిర్యాల-22, వికారా బాద్‌-21, కామారెడ్డి-20, నిర్మల్‌-20, కొత్తగూ డెం-20, బోనగిరి20, సంగారెడ్డి-20, సిద్దిపే ట్‌-13, ఆదిలాబాద్‌-12 జిల్లాల్లో తూనికల కొలతల శాఖ అధికారులు మొత్తం 260 కేసులను నమోదు చేసింది. వినియోగదారులు మోసపోకుండా చూసేందుకు తూనికల శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందనీ, దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులపై వినియోగదారులు తూనికల కొలతల శాఖ వాట్సప్‌ నంబర్‌ 7330774444, టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333పై ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here