పట్టువీడని రాహుల్‌..!

0
  • తెరపైకి అశోక్‌ గ¬్లత్‌..?
  • అధ్యక్ష పదవి రేసులో సీనియర్లు..!

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగలేనంటూ రాహుల్‌ గాంధీ పట్టువీడకపోవడంతో తదుపరి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ నియమితులయ్యే అవకాశముంది. రాహుల్‌ రాజీనామాను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తిరస్కరించినా, పదవిలో కొనసాగాల్సిందిగా పలువురు సీనియర్లు బతిమాలినా రాహుల్‌ గాంధీ ససేమిరా అంటున్నారు. దీంతో సోనియా గాంధీ, అహ్మద్‌ పటేల్‌, గులాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌తో కూడిన కమిటీ కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాట మొదలు పెట్టింది. ఈ ప్రక్రియలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పేరు తెరపైకి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీతో అనుబంధం ఉన్న గెహ్లాట్‌ అధ్యక్ష పదవికి సరైన వారని నాయకత్వం భావిస్తోందని తెలిసింది. గెహ్లాట్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందన్న విపక్షాల విమర్శకు తెరదించవచ్చని కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న 68 ఏళ్ల గెహ్లాట్కు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో రెండు సార్లు రాజస్థాన్‌ సీఎంగా పని చేసిన ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అస్లాం షేర్‌ ఖాన్‌ కూడా అధ్యక్ష పదవి కోసం ఎదురు చూసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టడానికి తనకు తగిన అర్హతలున్నాయంటూ బహిరంగంగా కోరారు. తర్వాత కర్ణాటక సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ కూడా అధ్యక్ష బాధ్యతలు కావాలని నర్మగర్భంగా అడిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here