ఏపీకి ప్రియాంక

0
  • ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ బస్సు యాత్ర

ఏపీలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్‌ పార్టీలు రెడీ అవుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసేస్తున్నాయి. ఇతర పార్టీలో వారికి గాలం వేస్తూ రండి..రండి అంటూ వెల్‌కమ్‌ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనంతరం తుడిచిపెట్టుకపోయిన పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ‘హస్తం’ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీలోని పెద్దలు భేటీల విూద భేటీలు నిర్వహిస్తూ వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ‘ప్రత్యేక ¬దా’నే కాపాడుతుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ‘ప్రత్యేక ¬దా – ప్రజా భరోసా’ పేరిట బస్సు యాత్ర నిర్వహించాలని ఆ పార్టీ పెద్దలు ఫైనల్‌ చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 రోజుల పాటు బస్సు యాత్ర జరుగనుంది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుండి ప్రారంభమై… మార్చి 3వ తేదీ ఇచ్చాపురంలో ఈ యాత్ర ఎండ్‌ కానుంది. 2 వేల 251 కి.విూటర్ల మేర సాగనుందని ఏపీ పీసీసీ వెల్లడించింది. బస్సు యాత్ర సందర్భంగా 54 సభలు ఫైనల్‌ చేసినట్లు…పేర్కొన్నారు. ఇక యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ¬దాలో తొలిసారి ఏపీలో ప్రియాంక అడుగు పెట్టనున్నారు. ఫిబ్రవరి 27, 27వ తేదీల్లో రాహుల్‌…, పర్యటించనున్నారు. ప్రియాంక..రాహుల్‌తో పాటు పాల్గొంటారా ? లేక ఇతర తేదీల్లో పర్యటిస్తారో తెలియాల్సి ఉంది. ప్రత్యేక ¬దాను కాంగ్రెస్‌ మాత్రమే ఇస్తుందని చెప్పేందుకు..బస్సు యాత్ర కార్యాచరణను రూపొందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here