వాస్తవానికి దగ్గరగా రాఘవేంద్ర సిద్ధాంతి ఫలితాలు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

సర్వే రిపోర్ట్‌లతో సై అంటే సై అని ఢీకొడుతున్న నాడీ తంత్ర జోతిష్య వేత్త పండితులు రాఘవేంద్ర. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? ఎవరి జాతకాలు ఎలా ఉంటాయి? ఎవరి గ్రహచారాలు తలకిందులవుతాయి? అన్న విషయాన్ని అంజనం వేసినట్టుగా చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కె సి ఆర్‌ అసెంబ్లీని రద్ధు చేసి ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటన చేసిన నాటి నుండి గెలిచేది ఎవరు? ఒడేది ఎవరు? తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఏ పార్టీ భవితవ్యం ఏ విధంగా మారబోతుంది? అని తెలుకునే క్రమంలో రకరకాలైన సర్వే సంస్థలు ఓటరు నాడిని పట్టుకునే పనిలో తనమునకలౌతున్న సమయంలోనే రాఘవేంద్ర సిద్ధాంతి తనదైన శైలిలో ఓటరు నాడిని అంచనా వేశారు. ప్రముఖ సర్వేసంస్థలు వాస్తవ పరిస్థితులకు బారెడు దూరంగా అంచనాలు చెబితే రాఘవేంద్ర వాస్తవిక పలితాలకు ఎంతో సన్నిహితంగా చెప్పగలిగారు. లగడపాటిలాంటి మేటి సర్వే నిపుణులు ఒక్క అక్షరం కూడా సరిపోలని విధంగా ఫలితాలు వెల్లడిస్తే రాఘవేంద్ర అందుకు విరుద్ధంగా అంచనాలు వెల్లడించారు. తెలంగాణలో 30 యేళ్ళ తర్వాత ఇండిపెం డెంట్స్‌ /రెబల్స్‌ 8 నుండి 10 స్థానాలలో గెలవబోతున్నారని లగడపాటి చెప్పి అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టారు. పైగా వీరి పేర్లను రోజుకు రెండిటిని మాత్రమే వెల్లడిస్తానంటూ సస్పెన్స్‌ లోకి నెట్టారు. అంతిమంగా అడ్డగోలుగా దెబ్బతిని అభాసు పాలయ్యారు. సోషల్‌ మీడియాలో గ్రేట్‌ బఫూన్‌గా, లాఫింగ్‌ స్టాక్‌గా మిగిలిపోయారు. వాస్తవానికి ఈ ఎన్నికలలో ఇండిపెండెంట్ల సంఖ్య 2 దాటలేదు. అదే రాఘవేంద్రసిద్ధాంతి తన జ్యోతిష పరిజ్ఞానంతో టి ఆర్‌ యస్‌ పార్టీ ఈ ఎన్నికలలో 73 నుండి 85 వరకు సీట్ల ను ప్రజల మన్ననలతో సాధించడం ద్వారా విజయాన్ని కైవసం చేసుకోబోతుందని చెప్పారు. వాస్తవంలో కేసీఆర్‌ పార్టీ పాజిటివ్‌ ఓటింగ్‌తో 88 స్థానాలను గెలుచుకుంది.

తెలంగాణలో అత్యధికంగా నియోజక వర్గాలను కల్గిన హైదారాబాద్‌ (15) లో టిఆర్‌యస్‌ 3 లేదా 4సీట్లు గెలుస్తుందని చెప్పగా వాస్తవానికి 7 స్థానాలు గెలిచింది. నిజామాబాద్‌ (9) లో దాదాపు 6 సీట్లను సాధించే అవకాశం ఉందని చెప్పగా 8 సీట్లనే గెలవడం విశేషం. అలాగే తెలంగాణ మొత్తం మీద టిఆర్‌యస్‌ పార్టీకి కరీంనగర్‌, మహబూ బ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాలలో అత్యధికంగా దాదాపు ఒక్కొచోట 10 స్థానా ల చొప్పున సాధించే అవకాశం ఉందని అంచనావేయగా మహబూబ్‌న గర్‌లో 13, కరీంనగర్‌లో 11, వరంగల్‌లో 10, స్థానాలను గెలిచింది.

ఇదిలా ఉండగా ప్రజా కూటమికి అత్యధికంగా రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో ఒక్కో చోట దాదాపు 6 నుండి 8 సీట్లు సాధిస్తుందని చెప్పగా రంగారెడ్డిలో 3, నల్గొండలో 3 స్థానాలను సాధించింది. హైదారాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో 1 నుండి 3 వరకు సీట్లను సాధించుకునే అవకాశం ఉందని చెప్పగా కూటమి హైదరాబాద్‌లో 0, ఆదిలాబాద్‌లో 1 గెలిచింది.

తెలంగాణా మొత్తం మీద బిజెపి 3 నుండి 5 స్థానాలు గెలుస్తుందని అంచనావేయగా 1 స్థానం గెలిచింది. మజ్లిస్‌ దాదాపు 6 లేదా 7 సీట్లను సాధిస్తుందని చెప్పగా 7 స్థానాలను గెలిచింది. ఇదిలా ఉండగా ఎన్నికల అనంతరం ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు చాలా ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. తాజా ఎన్నికలలో 1.20లక్షల ఓట్ల మెజార్టీ సాధించి అందరికన్నా ముందు వరసలో నిలిచి ఇప్పటికే ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఇక మామగారి పురస్కారం ఎలా ఉంటుందో మరో 48 గంటలలో తేలిపోతుంది.

జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకుని వాస్తవానికి ఇంత దగ్గరగా ఫలితాలు ఎలా చెప్పగలిగారు అని అడిగితే ఆయన తనకున్న సోర్స్‌ను ఇలా వెల్లడించారు.

”ఒక నాయకుడికి రాజయోగం రాజకీయ యోగంగా మారి అధికారం అందలం ఎక్కించాలంటే వారి వారి జాతకాలలోజీవకారకుడు అయిన బహస్పతి ,కర్మకారకుడు అయిన శనీశ్వరుడు,మాయా కారకుడు అయిన రాహువు ,ద్వజకీర్తి యోగమును అందించు కేతువు ,ఆత్మ కారకుడు అయిన సూర్యుడుతో పాటు అంగారకుడు కూడా యోగాన్నిచ్చే రాసులలో ఉండి ఆయా గ్రహాలు పరస్పరం గానే కాకుండా మిగతా భలమైన గ్రహాలతో కూడా సంభంధం ను పొందుతున్న వేళ గోచర గ్రహాలు ,దశలు కూడా యోగించా”లన్నారు . ”ఆరకం గా తీసుకున్నట్లైతే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలలో పోటీ చేస్తున్న ఏ రాజకీయ పార్టీ అధినేతకు లేదా ఆయా పార్టీలలో ఉన్న ముఖ్యనాయకులకు కూడా పైన చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో రాజయోగము కనపడటం లే”దన్నారు .

”అయితే మిగతా నాయకులతో పోలిస్తే కొంతవరకు కెసిర్‌ జాతకంలో జన్మ గురువు,కుజులను గోచార శనీశ్వరుడు, రాహువు, రవి ,కేతువులు ప్రభావితం చెయ్యడం, దానికి ప్రస్తుతం నడుస్తున్న దశలు కూడా యోగించడం కారణం చేత జాతకం లో దైవ బలం పెరిగి సకాలం లో మహనీయులైన కొందరు గురువులు సూచించిన పూజలను నిర్వర్తించడం వలన రాజయోగం పరిపూర్ణంగా మారడానికి కొంతవరకు అవకాశం కల్గిందన్నారు. ”ఇందువల్ల టిఆర్‌యస్‌ పార్టీ ఈ ఎన్నికలలో అఖండమైన మెజారిటీ తో అనగా 73 నుండి 85 వరకు సీట్ల ను ప్రజల మన్ననలతో సాధించడం ద్వారా విజయాన్ని కైవసం చేసుకోబోతుందని” సిద్దాంతి చెప్పారు. ఆయన నుంచి ఎవరైనా తమ సమస్యలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే

ఎaఱశ్రీ ఱస : aరసఅaసఱaర్‌తీశీశ్రీశీస్త్రవఏస్త్రఎaఱశ్రీ.షశీఎలో సంప్రదించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here