పార్లమెంట్‌లో రాఫెల్‌ రగడ..

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

పార్లమెంట్‌ ఉభయసభలను రాఫెల్‌ డీల్‌ వ్యవహారం స్తంభింపజేసింది.. అధికార, విపక్షాల నినాదాలు, ఆందోళనలతో ఉభయసభలు ¬రెత్తిపోయాయి. ఓవైపు రాఫెల్‌ డీల్‌ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభల్లోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తరుణంలో పార్లమెంట్‌లో రాఫెల్‌ డీల్‌పై చర్చ అవసరం లేదంటూ అధికార పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. రాఫెల్‌ వ్యవహారంలో సుప్రీం లోతుగా వెళ్లలేదు కాబట్టి, జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని కాంగ్రెస్‌, ఇతర పక్షాల ఎంపీలు పట్టుపట్టారు. దీంతో సభా వ్యవహారాలకు అంతరాయం ఏర్పడింది. ఎంతసేపటికీ సభ్యులు ఆందోళన విరమించక పోవటంతో ఉదయం ఇరు సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉదయం 11.30కి వాయిదా పడ్డాయి. తిరిగి ఉభయసభల్లో ప్రారంభైనా పరిస్థితి మారలేదు. దీంతో రాజ్యసభ ఎలాంటి బిజినెస్‌ జరగకుండా వాయిదా పడగా, లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగించాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ డిమాండ్‌ చేశారు. పెద్ద ఎత్తున సభ్యులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకోవడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్‌తో పాటు విపక్ష సభ్యులు ఒక వైపు, బీజేపీ పక్షాల సభ్యులు ఒకవైపు ఉండి వాదనలకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సర్ధిచెప్పే ప్రయత్ని స్పీకర్‌ ప్రయత్నం ఫలించలేదు. రఫేల్‌పై చర్చను కోరుతూ ప్రతిపక్ష నేతలు ఆందోళనను మరింత ఉదృథం చేశారు. దీంతో డిసెంబరు 17 వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here