అగ్రకులాలకు కోటా..

0

సామాజిక న్యాయం కోసమే

కోలాపూర్‌ : అగ్రకులాలకు కోటా ఇవ్వడమంటే అది సామాజిక న్యాయం వైపు వేసిన పెద్ద అడుగు అని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభలో బిల్లు పాస్‌ అయిందని, రాజ్యసభలోనూ ఈబీసీ బిల్లు పాసవుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదంతో అగ్రవర్ణాల పేదల్లో అన్యాయం జరిగిందన్న భావన పోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలు కావాలన్నారు. మంగళవారం ఈబీసీ బిల్లుకు ఆమోదం దక్కిందని, ఈబీసీ బిల్లు ప్రకారం.. పేద అగ్రకులస్థులకు జనరల్‌ క్యాటగిరీలో 10శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నామన్నారు. రాజ్యసభను ఒక రోజు పొడిగించామని, బహుశా బిల్లును పాస్‌ చేస్తారని ఆశిస్తున్నానని, ప్రజల ఆశయాలను గౌరవిస్తారని భావిస్తున్నానని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని సభ్యులు ఈబీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నట్లు మోదీ చెప్పారు. రాజ్యాంగ సవరణ కోసం ఈ బిల్లు కీలకమైందన్నారు. అగస్ట్రా చోపర్ల డీల్‌ లో మధ్యవర్తిగా వ్యవహరించిన మైఖేల్‌ క్రిస్టియన్‌ కు ఫ్రెంచ్‌ ఫైటర్‌ జెట్‌ డీల్‌ లో కూడా ప్రమేయం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ రెండు ఒప్పందాలూ కూడా గత యూపీఏ హయాంలో జరిగినవేనని పేర్కొన్నారు. కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలతో గత యూపీఏ ప్రభుత్వం భ్రష్టుపట్టిందని విమర్శించారు. రాఫెల్‌ డీల్‌ పై విపక్షాల విమర్శలన్నీ రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన పేర్కొ న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here