Featuredజాతీయ వార్తలు

11న పీఎస్‌ఎల్వి-సి 48 రాకెట్‌ ప్రయోగం..

ఒకేసారి 10 ఉపగ్రహాలు నింగిలోకి శ్రీహరికోట నుండి రెండు వారాల వ్యవధిలోనే మరో రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11న షార్‌ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పీఎస్‌ఎల్వీ – సి 48 రాకెట్‌ ను ప్రయోగించేందుకు తుది ఏర్పాట్లు చేపట్టారు. ఈ రాకెట్‌ ద్వారా ఆర్‌ఐ శాట్‌-2 బి-ఆర్‌1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఈ రాడార్‌ ఇమేజింగ్‌, ఎర్త్‌ అజ్జర్వేషన్‌ శాటిలైట్‌ బరువు 628 కిలోలు భూ పరిశీలన కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. దీంతో పాటు 9 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఇందులో ఇజ్రాయిల్‌, ఇటలీ, జపాన్‌ లకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం తో పాటు యుఎస్‌ కు చెందిన 6 ఉపగ్రహాలు ఉన్నాయి. ఒకే రాకెట్‌ ద్వారా 10 ఉపగ్రహాలను భూమికి 576 కి.మీ కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే పీఎస్‌ఎల్వీ-సి 48 రాకెట్‌ షార్‌ నుండి ప్రయోగిస్తున్న 75 వ ఉపగ్రహ ప్రయోగ నౌక పీఎస్‌ ఎల్వి రాకెట్‌ లలో ఇది 50 వది మొదటి ప్రయోగ వేదిక నుండి 37వ ప్రయోగం నాలుగు స్ట్రపాన్‌ బూస్టర్లతో దీనిని నిర్మించారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 11 న మధ్యాహ్నం 3.25 గంటలకు రాకెట్‌ ను ప్రయోగించే అవకాసం ఉంది.గత నెల 27 న పీఎస్‌ఎల్వీ-47 రాకెట్‌ను షార్‌లోని సెకండ్‌ లంచ్‌ ప్యాడ్‌ నుండి విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పుడు ఫస్ట్‌ లాంచ్‌ ప్యాడ్‌ నుండి తాజా రాకెట్‌ ను ప్రయోగిస్తున్నారు.ఒకేసారి 10 ఉపగ్రహాలు నింగిలోకి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close