దమ్ముంటే అవినీతిపరుడనని రుజువు చేయండి

0

  • విపక్షాలకు మోదీ సవాల్‌

లక్నో :

తన హయాంలో తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు దమ్ముంటే విపక్షాలు రుజువుచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల నేతలకు సవాల్‌ విసిరారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా రెండు దశాబ్దాల పాటు నిబద్ధతతో పనిచేశానని, ఏ అవినీతి కుంభకోణంలోనైనా తన ప్రమేయం ఉంటే విపక్షాలు రుజువు చేయాలని ఆయన సవాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ… ‘మహాకూటమి నేతలకు నేను బహిరంగ సవాలు చేస్తున్నానని, వారికి దమ్ముంటే, నాపై ఆరోపణలు చేయడం కాకుండా నా సవాలును స్వీకరించాలని మోదీ అన్నారు. నేను అప్రకటిత ఆస్తులు కలిగి ఉన్నా, ఫాంహౌస్‌లు కానీ , షాపింగ్‌ కాంప్లెక్స్‌లు కానీ, విదేశీ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్నా వాటిని చూపించాలని సవాలు చేస్తున్నా అని అన్నారు. విదేశీగడ్డపై నాకు ఏ ఆస్తులున్నా, కోట్లాది రూపాయలు విలువచేసే బంగ్లాలు, హై-ఎండ్‌ కార్లు, కోట్లకు కోట్లు సొమ్ములు ఉంటే నిరూపించండంని మోదీ తీవ్రస్వరంతో అన్నారు. ధనవంతుడు కావాలనో, పేద ప్రజల సొమ్మును లూటీ చేయాలనో తాను ఏనాడూ కలగనలేదని, తనకు వ్యక్తిగత జీవితం కంటే పేద ప్రజల సంక్షేమం, మాతృభూమి సంరక్షణ ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. తనపై విపక్షాల విమర్శలను తాను గిఫ్ట్‌గానే భావిస్తానని, ప్రజలే బీజేపీని ఓటింగ్‌ ద్వారా అధికారంలోకి తీసుకురావడం ద్వారా తన తరఫున అలాంటి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here