ఎన్నికల్లో మద్యంతో పాటు ధూమపానంపైనా నిషేధం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎన్నికలు జరుగుతున్నాయంటే మద్యంపై నిషేధం తెలిసిన విషయమే. అయితే ధూమపానం కూడా నిషేధించి కేంద్రం సరికొత్త చర్యకు శ్రీకారం చుట్టింది. పోలింగ్‌కు ముందు సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు దీన్ని ఇప్పటి వరకు అమలు చేస్తున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు రోజు మద్యం షాపుపై నిషేధం ఉంటుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం భారత ఎన్నిక చరిత్రలోనే తొలిసారి ధూమపానంపై నిషేధంతో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎన్నికల రోజు మద్యంతోపాటు, సిగరెట్లు అమ్మే షాపులు కూడా మూసేయాల్సిందేనంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డిసెంబరు చివరి వారంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. జిల్లా ఎన్నికల అధికారి, మేజిస్టేట్ర్‌గా వ్యవహరించే కలెక్టర్లకు ఈ ఉత్తర్వులు అందాయి. పోలింగ్‌ బూత్‌ వద్ద మద్యం, సిగరెట్లపై నిషేధం అమల్లో ఉన్నట్లు తెలియజేసే బ్యానర్లు వేలాడదీయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే టుబాకో కంట్రోల్‌ సెల్స్‌ బ్యానర్ల ఏర్పాటును పర్యవేక్షిస్తాయి. సిగరెట్లతోపాటు పొగాకు ఉత్పత్తులైన బీడీ, గుట్కా, నమిలే పొగాకు తదితరాలపై కూడా నిషేధం ఉంటుంది. ప్రతి బూత్‌ ప్రిసైడింగ్‌ అధికారులు తమ పరిధిలోని మద్యం, సిగరెట్‌ అమ్మకాలు దుకాణాలు మూసివేసిందీ లేనిదీ చెక్‌ చేసుకోవాలి. 2019లో జరిగే ఎన్నికల నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే నష్టంపై ప్రజల్లో కొంతైనా అవగాహన కలిగి కొందరైనా దూరమైన బాధితులకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అమల్లోకి తేవాలని భావించినట్లు ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here