నోరెత్తితే కేసులు స్వేచ్ఛలేని జీవితాలు

0

-ఇష్టారాజ్యంగా ప్రవర్తన

-దళిత ముఖ్యమంత్రి ఏడి?

-కేసీఆర్‌ వల్లే కాంగ్రెస్‌లో కోవర్టులు

తెలంగాణలో స్వేచ్ఛ లేదని అంటారేమిటి..?

స్వేచ్ఛ అంటే కాళ్ళతో నడుస్తూ తిరగటం కాదు. అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతుకలను గౌరవించాలి. అంతేకాని ఆ గొంతుకులను నులమొద్దు. ఇప్పుడు గొంతులు నలుపుడు, నొక్కుడే జరుగుతుంది.

మీ అరెస్ట్‌ గురించి..:

తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కేసులు లేవు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఓ పేదోడు చనిపోతే కాడి మోయడానికి పోయా. అంతే ఓ కుట్ర కేసు పెట్టి మూడురోజులు జైల్లో పెట్టింది. ఉద్యమాలు చేసిన కష్ణ మాదిగిను జైల్లో పెట్టించింది.

జగ్గారెడ్డి విషయం..:

ఆ కేసులో ఆయన ఆరోవాడు. మరి మిగతా ఐదుగురు గులాబీ చొక్కా వేసుకోగానే మంచోళ్ళు అయ్యారా.?

ఓటుకు నోటు కేసు..:

ఈ కేసులో ఫొన్‌ ట్యాపింగ్‌ చేసినోడు కరెక్ట్‌ అయ్యాడు ఈ ప్రభుత్వంలో. కెమెరాలు ఎక్కడివి. అన్నీ బయటకు వస్తాయి. చాలా ఉన్నాయి.

చాలా అంటే..?

కేసీఆర్‌ ఏకంగా 29 మందిని తాయిలాలు, దుడ్లు ఇచ్చి లాక్కోలేదా.

కేసీఆర్‌ కు మెజారిటీ ఉందికదా..?

అభద్రతాభావం నెలకొంది. దాంతో

ఎమ్మెల్యేలను లాక్కున్నాడు. అయినా భయం పోలా… ఇంకా ఎమ్మెల్యేలు కావాలని ఎన్నికలన్నాడు. ఇప్పుడు తల పట్టుకున్నాడు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు గురించి..?

ఏనాడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మావాళ్ళను ఇద్దర్ని చేశాడు. ఖర్మ కొద్దీ చివరకు ఆయనే

అసెంబ్లీ రద్ధు చేసుకున్నాడు.

సంపత్‌ గురించి..?:

ఇదో కథ. ప్రభుత్వం మీద కేసులు వేశాడని… అసెంబ్లీ రాద్దాంతంలో లేని సంపత్‌ సభ్యత్వం ఏకంగా రద్దు చేశారు. ఇది అసెంబ్లీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం.

నయీం కేసు గురించి..:

నయీం రాసుకున్న డైరీ ఏమైంది. డబ్బు, బంగారం, వజ్రాలు ఆయుధాలు ఎవరు నొక్కారో ప్రజలకు తెలుసు.

ప్రభుత్వం పారదర్శకంగా ఉందని కేసీఆర్‌ చెపుతున్నారు.?

రోడ్డు భవనాల శాఖ అంతర్జాలంలో కేవలం 7 జీఓలు దర్శనమిస్తాయి. సుమారు 23 వేల జీఓలు రహస్యం గా ఉంచారు. సిఎం సహానిధిని కూడా దోచుకున్నారు. వీళ్లంతా సిండికేట్‌ అయి రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారు.

కాంగ్రెస్‌ కూటమి గెలుస్తుందా..?

ప్రజలు ప్రేమతో కూటమిని గెలిపించబోతున్నారు. పగతౌ తెరాసను తరిమికొట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈసారి కాంగ్రెస్‌ లో సీట్ల వ్యవహారం ఎలా ఉంది.?

గెలిచే పార్టీకదా ఆశావహులు సహజంగా ఎక్కువమంది ఉన్నారు. అందుకే ఏడు అంచెల వడపోతలతో ఆభ్యర్థుల నిర్ణం ప్రజాభీష్టాం మేరకు జరుగుతుంది. ఇది కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న మంచి విషయం.

మీ అస్తుల వివరాలు..?

నా జీవితం తెరిచిన పుస్తకం. నాకు పెద్దగా చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు లేవు.

కూటమిలో 17 మంది కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్‌ టాస్క్‌ ఫోర్స్‌ గుర్తించింది. ఏమంటారు..?

ఈ విషయంపై గత ఆరేడు నెలలుగా ఏఐసీసీ తెలంగాణ పిసిసిని

హెచ్చరించింది. కొందరిని గుర్తించాం. ఈ విపరీత ధోరణికి కేసీఆర్‌ నీచ రాజకీయాలే కారణం.

కాంగ్రెస్‌ లో కోవర్టుల గురించి..:

కోవర్టులను గుర్తించాం. అధిష్టానానికి చెప్పాం. చర్యలు తీసుకుంటారు.

చివరిగా…

దళితులు ఎప్పటికీ కలవరని..?

మాల, మాదిగలు కలవరనేది అపోహ మాత్రమేనని,

బీసీ, ఓసీల మధ్య అపోహలు స ష్టించాలని ఇక్కడ తెరాస, పైన బీజేపీ కుట్రచేస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here