భావోద్వేగపు పోస్ట్‌ చేసిన ప్రియా వారియర్‌

0

మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. తన సహ నటుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ను ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు. ఈరోజు రోషన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతనితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. విషెస్‌ తెలిపారు. అనంతరం రోషన్‌కు సంబంధించిన మరో ఫొటోను పోస్ట్‌ చేస్తూ..

‘నాకు అంత గొప్పగా మాటలు రావు. కానీ నా కోసం ఎంతో చేసిన నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను రోషన్‌. ఎన్ని సమస్యలు వచ్చినా నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహించింది నువ్వు ఒక్కడివే. నాకోసం ప్రతిసారీ ఎంతో రిస్క్‌ తీసుకున్నావ్‌. నీకోసం నేను ఇంత చేయగలనో లేదో తెలీదు. కానీ నేను నీకిచ్చే ప్రాముఖ్యత ఎంతో తెలియజేయాలనుకుంటున్నాను. నీ విలువ నా మాటలకంటే ఎక్కువన్న విషయం నీకు ముందే తెలుసుగా.. జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకోసం ఎప్పుడూ ఇలాగే వెలుగుతూ ఉండాలి. నీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండేలా నా వంతు క షి చేస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు ప్రియ.

రోషన్‌, ప్రియ జంటగా ‘ఒరు అడార్‌ లవ్‌’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వీరి జంటకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. తెలుగులో ఈ చిత్రం ‘లవర్స్‌ డే’గా విడుదలైంది. కానీ ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here