ప్రభుత్వ డాక్టర్‌లకు ప్రైవేటు ప్రాక్టీసు ‘రోగం’

0

ఏళ్ల తరబడి ఒకే చోట వైద్యం చేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు

మెదక్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ వైద్యం అందుబాటు లో ఉండాలన్న ఉద్దేశంతో వైద్య పరికరాలు అందుబాటులో తెచ్చారు. దీంతోపాటు కంటి వెలుగు, బోధకాలు, క్షయ వ్యాధి రక రకాల వ్యాధులతో బాధ పడుతున్న గ్రామీణ, పట్టణ, పేద వారందరికీ వైద్యం అందుబాటులో ఉండాలన్నది కెసిఆర్‌ లక్ష్యం నెరవేర్చాలన్న ఉద్దేశ్యం తోనే ప్రభుత్వాసుప త్రులకు అన్ని రకాల ఆశయంతో తీర్చిదిద్దారు. మెదక్‌ జిల్లాలో కొంత మంది డాక్టర్లు 15 నుండి18 ఏళ్ల ఒకే చోట ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయించు ప్రైవేటు ఆసుపత్రులు పెట్టుకొని ప్రభుత్వ ఆసు పత్రికి వచ్చే వారిని స్కానింగ్‌ రక రకాల వైద్యము చేయుచున్నారు. మెదక్‌ జిల్లాలో ఉన్న చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్రానికి డిసెం బర్‌ 30ఆదివారం రోజున తాళం వేసిన సంగతి అంద రికి తెలిసిందే. బొడ్మట్పల్లి ప్రధాన రహదారి నుంచి పాపన్నపేట మండల పరిధి పొడ్చన్‌పల్లి గ్రామం లోకి వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరం, అయినా ఈ గ్రామంలోకి వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఎవరు చూస్తారులే.. ఎవరు పట్టించుకుంటారులే అన్న భావనతతో ఉద్యోగులు విధులకు రాకుం డా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయాలను నీరుగార్చే విధంగా చేస్తున్నారు. మెదక్‌ లో ఒక డాక్టర్‌ అయితే ఒక్కోచోట ఉంటూ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పోతారని ఆరోప ణలు చాలా వినిపిస్తున్నప్పటికీ ఇక్కడ మెదక్‌ లో ఉన్న వైద్యాధికారి మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరి స్తున్నారని గ్రామీణ పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్న శంకరం పేట, పాపన్నపేట మండల పరిధి పొడ్చన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రసన్నరాణి తంతు ఇది. ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం రోగులు ఎప్పుడు వెళ్లినా ఖాళీ కుర్చీ దర్శనమిస్తుందని పీహెచ్‌సీ పరిధి ప్రజలు ఆరోపిస్తున్నారు. వచ్చిన రోగుల్లో లేక విలేకరులు ఫోన్‌లో అడిగిన డాక్టర్‌ను సంప్రదిస్తే జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరా వుకు తెలియజేశానని, సెలవులో ఉన్నానని చెబుతుంటారని యువకులు చెబుతున్నారు. పై స్థాయి ఉద్యోగి సరిగ్గా విధులకు రాకపోవడంతో దిగువ స్థాయి సిబ్బందిని అడిగేవారు లేకుండాపోయారు. దీంతో వారు ఇష్టం వచ్చినట్లు ఆరోగ్య కేంద్రానికి హాజరవుతున్నారని ప్రజలు చెబుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారని వారు వివరిస్తున్నారు. శుక్రవారం గర్భిణులు, బాలింతలకు చికిత్సలు నిర్వహి స్తున్నందున ఆ రోజు మాత్రం ఆరోగ్య కేంద్రంలో కనిపిస్తారని, మిగిలిన రోజుల్లో ఎప్పుడు చూసినా ఖాళీ కుర్చీనే దర్శనమిస్తుందని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్‌ విధుల్లోకి రాకపోవడంతో గ్రామస్థులు తెలియజేయగా పొడ్చన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెట్రో న్యూస్‌ సందర్శించింది. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here