Featuredస్టేట్ న్యూస్

రవాణా శాఖ కార్యాలయంలో జోరుగా ప్రైవేట్‌ వ్యక్తుల దందా

ఇష్టారాజ్యంగా వసూళ్లు – పట్టించుకోని అధికారులు

  • వాహన డీలర్లతో నెలసరి మామూళ్లు
  • వాహనాలు నడపకపోయినా లైసెన్సు జారీ

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను రద్దుపరిచి ఏజెంట్లు ఆ పరిసరాల్లోనే ఉండకూడదని నిబంధనలు విధించినప్పటికీి ప్రాంతీయ సహాయ కార్యదర్శి, రవాణా శాఖ తూర్పు విభాగము మలక్‌ పేట్‌ కార్యాలయం లో ఏజెంట్లు, ప్రైవేటు వ్యక్తులు హవా కొనసాగిస్తున్నారు. కార్యాలయంలో అధికారులకు, సిబ్బందికి కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేట్‌ వ్యక్తులు కార్యాలయ ఏజెంట్ల ద్వారానే అక్రమ వసూళ్లు ముడుతున్నాయి.రవాణా శాఖలో అవినీతి పెచ్చుమీరుతోంది. కొంతమంది అధికారులు కొందరు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా దందా సాగిస్తున్నారు. లైసెన్సు పొందాలన్నా ఏజెంట్లను ఆశ్రయిస్తే వారు చె ప్పిన డబ్బులు ముట్టచెబితే అలాంటి వారు వాహనాలు నడిపినా, నడపకపోయినా లైసెన్సు వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.కార్యాలయ ఆవరణలో లైసెన్సు, వాహనాల ఫిట్‌నెస్‌ రెన్యువల్స్‌కు సం బంధించి వాహనదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న ఏజెంట్లను రవాణా శాఖ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. రోజూ లక్షల్లో కార్యాలయంలో అక్రమ వసూళ్లు జరుగు తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదికాక మరోపక్క ప్రైవేట్‌వ్యక్తులు, ఏజెంట్లు, ఇష్టారాజ్యంగా వాహన దారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కార్యాలయం పరిధిలో దాదాపు 20 మందికి పైగా ఏజెంట్లు ఉన్నారు. అధికారులకు సైతం తెలియని చట్టాన్ని వాహన దారుల ముందు వీరు చెప్పి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. వాహనాలకు సంబంధించిన క్లియరెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు, బదిలీలు ఏజెంట్ల ద్వారానే జరుగుతాయి. నేరుగా వాహన దారుడు కార్యాలయంలోకి వెళితే ఏజెంట్లు ప్రత్యక్షమై నిబంధనలు చెప్పి వారిని అనవసరంగా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతినెలా ప్రయివేటు బస్సుల నుంచి, డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకుల నుంచి, లారీ ఓనర్స్‌ అసోషియేషన్ల నుంచి, ఇంకా పలువురు ద్విచక్రవాహన దారులతో పాటు అన్ని రకాల వాహన డీలర్లతో నెలసరి మామూళ్లు ఏజెంట్ల ద్వారానే కార్యాలయ అధికారులకు చేరవేస్తారు. ఇక కార్యాలయంలో సిబ్బంది కి తెలియని పనులు సైతం ఐదుగురు ప్రైవేట్‌ వ్యక్తులే నిర్వహిస్తారు. వీరు రోజువారి విధులకు హాజరై కార్యాలయ సిబ్బందిలాగా చలామణి అవుతూ వాహన దారులపై ఆజమాయిషీ చలాయిస్తున్నారు. ఉన్నతాధి కారులకు నెలసరి మామూళ్లు అందుతుండటంతో తెలిసీ తెలియనట్లు కార్యాలయ సిబ్బందికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వినపడు తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close