ఎన్నికల ముందు వేటు.. పార్టీకి చేటు

0

– పోయే వారు పోతున్నారు

– మరికొందర్ని పంపుతున్నారు

– ఖాళీ అవుతున్న కారు…

కారులో మొదలైన కలవరం… ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ వాడిపోతున్న గులాబీ వనం.. పార్టీ శ్రేణుల్లో సన్నగిల్లుతున్న ఉత్సాహం.. గెలుపు సులువంటూ చెప్పిన అధినేత మాటల్లోనే అయోమయం.. కారుకు దారి ఏటో అర్థం కాని పరిస్థితి.. కారు గట్టెక్కుతుందో, రిపేరు షెడ్డుకెళుతుందో అనే అనుమానాలు రోజరోజుకు పెరుగుతూ ఉన్నాయి. అసమ్మతులు తిరుగుబాటు, నమ్ముకున్న వారికి అవకాశం రాలేదని రాజీనామాలు, అనుకున్నదే తడువుగా అధినేత వేటు అన్ని కలగలిపి కారు గమ్యం ఆగమ్యగోచరంగా మారిపోయింది.. గెలుపు మాట దెవుడెరుగు కనీసం కారు స్టీరింగ్‌ నడిపేవారే గగనమవుతున్నారు… ఖాళీ అవుతున్న కారును అధినేత ముందుకు నడుపుతారో, మధ్యలో వదిలేసి విశ్రాంతి తీసుకుంటారో వేచి చూడాల్సిన సమయం దగ్గరపడుతోంది…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ లో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో రోజు రోజుకు పరిమాణాలు మారిపోతున్నాయి.. అధి కారం చేజిక్కినట్టే అని చెప్పిన తెరాస అధినేత డీలా పడిపోయినట్లు కనిపిస్తోంది. పార్టీ ఆదేశా లను దిక్కరించిన వారిపై వేటు వేస్తూ ఉన్నారు.. అధినేత పనితీరు, పార్టీ పద్దతి నచ్చని నాయ కులు సైతం కారుకు టాటా చెపుతూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.. కారులో చిన్నచిన్న గా మొదలైన గలాటా పెనుతుఫానుగా మారి పోతుంది. పార్టీ శ్రేణులు కాపాడేయత్నంలో తెరాస విఫలమైందని అందుకు వేటుతో దూరమయ్యేవారు కొందరైతే, కారు దిగి చేయం దుకునే వారే పెరిగిపోతున్నారు.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్ది గులాబీ పార్టీలో జరుగుతున్న పరిస్థితుల వల్ల కిందిస్థాయి నాయకుల్లో, కార్యకర్తల్లో గెలుపు ఆశలు వదులుకున్నట్లేనని చెపుతున్నారు. అధినేత మాటల్లో కూడా అనుకున్నంత ఉత్సాహం లేకపోవడంతో బరిలో ఉన్న అభ్యర్థులు కూడా డీలా పడిపోతున్నారు. మాటల హోరుతో ప్రత్యర్థి పార్టీని చెండాడు కెసిఆర్‌ మాటల్లో తగ్గిన చురుకుదనానికి కారణాలు ఏంటో మాత్రం అర్థమే కావడం లేదు. కీలక సమయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తూ, కీలక నిర్ణయాలు తీసుకునే కెసిఆర్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది చతికిలపడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగసభలో మళ్లీ అధికారం ఇస్తే గెలిచి ప్రజలకు సేవచేస్తాం లేదంటే ఇంట్లోనే కూర్చోని విశ్రాంతి తీసుకుంటాం అనే మాటలు ఆయన వెంట రావడంతో పార్టీ శ్రేణులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తెరాస అభ్యర్థులకు నియోజకవర్గాల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకునేందుకు నానా యాతలు పడుతుంటే అధినేత సైతం నిరుత్సాహ పరిచే మాటలను బట్టి ఏం అర్థం చేసుకోవాలనేది నేడు ప్రధాన చర్చానీయాంశమయింది. దానికి తోడు పార్టీ పనితీరు అధినేత కుమారుడి ప్రవర్తన నచ్చక ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ యువనాయకుడు ఒంటెత్తు పోకడ కూడా ఆయన నిరుత్సాహనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సీనియర్లను, పార్టీని నమ్ముకున్న వారిని కలుపుకోని పోవడంలో తెరాస పార్టీ విఫలమయ్యిందని అందుకే వారందరూ అసమ్మతులుగా తయారై ఎవరికి నచ్చినట్లు వారు తయారవుతూ పార్టీ వీడతున్నట్లు సమాచారం.

గులాబీ కారులో గందరగోళం…

తెరాసలో జరుగుతున్న తాజా సంఘటనలు చూస్తుంటే అధినేత తీవ్ర ఒత్తిడిలో నిరుత్సాహంగా మారిపోయినట్లు తెలుస్తుంది. పది, పదిహేను రోజుల్లో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తెరాసలో చోటుచేసుకుంటున్న అనూహ్య సంఘటనలు బరిలో ఉన్న అభ్యర్థులను సైతం ఖంగుతినిపించేలా ఉన్నాయి. అసమ్మతి, వ్యతిరేకులందరిని బుజ్జగించి, ఏలాగోలా గట్టెక్కి అధికారంలోకి వచ్చాక పెద్దపీట వేయాలనే ఆలోచనతో ముందుకు నడవాల్సిన పార్టీ ఎన్నికల చివరి దశలో ఎందుకు గందరగోళంగా మారుతుందన్నదే అర్థంకాని ప్రశ్న. అధినేత మాటలకు తోడు, కెటిఆర్‌ కూడా గెలుస్తే పాలిస్తాం లేకుంటే అమెరికా చెక్కెస్తానని మాట్లాడడం చూస్తుంటే వీరంతా అధికారం కోసమే పనిచేస్తున్నారు, అధికారంలోకి వచ్చినా, రాకున్నా ప్రజల మధ్య ఉంటాననే నాయకులు ఉన్నారు కాని అధికారంలోకి రాకపోతే ఒకరెమో విశ్రాంతి అంటున్నారు. మరోకరెమో సేవే అవసరం లేదన్నట్టుగా మాట్లాడతుండడం చూస్తుంటే వీరిపై ఓటర్లకే కాకుండా పార్టీ కార్యకర్తల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఈ గందరగోళానికి తోడుగా కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్‌ తెరాస నేత హరీష్‌రావే తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్న కెసిఆర్‌కే ఓటు వేస్తారో, లేదో మీరే నిర్ణయించుకోవాలనే ఆడియో టేపు బహిర్గతం చేయండంతో అది మరింత రచ్చరచ్చగా మారిపోయింది.

తెరాసలో వేటు, రాజీనామాలే…

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక్కొక్కరు దూరం కావడంతో పార్టీ శ్రేణులంతా గందరగోళంగా తయారయ్యారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సిద్దాంతాలు, నాయకులు పనితీరు నచ్చకనే తాను పార్టీని వీడానని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని సక్రమంగా నిర్వహించకుండా కుటుంబ పాలన, సంపాదనకే అధిక ప్రాధాన్యత నిచ్చిన తెరాసను వీడడం తప్ప మరొ మార్గం లేదన్నారు. తెరాస ఎమ్మెల్సీగా ఉన్న యాదవరెడ్డి కూడా పార్టీని విడేందుకు సిద్దమై కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నారనే సమాచారం తెలుసుకున్న తెరాస కేంద్ర కార్యాలయం ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించినట్లు వెల్లడించారు. యాదవరెడ్డి బహిష్కరణ వెనుకు ఎన్నో కీలక పరిణామాలు జరిగినట్లు సమాచారం. ఒక్కొక్కరు వీడిపోతున్న పార్టీ తప్పులను సరిదిద్దుకోకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం కిందిస్థాయి కార్యకర్తలకు రుచించడం లేదు. అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో రాజీనామా బాటలోనే మరికొందరు నేతలు క్యూకడతున్నారని సమాచారం. దీనికి తోడు ప్రతిపక్ష నాయకులు తెరాస కారు ఖాళీ అయ్యేందుకు సిద్దంగా ఉందని, కెసిఆర్‌, ఆయన కుటుంబమే కారు నడుపుకోవాలంటూ సంకేతాలు సైతం ఇచ్చారు. ఇదే సమయంలో వికారాబాద్‌ జిల్లా అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. టిఆర్‌ఎస్‌ అధిష్టానం వికారాబాద్‌ స్థానాన్ని తనకు కేటాయించకుండా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌కు కేటాయించింది. ఆనారోగ్య కారణాలతోనే తనకు టిక్కెట్‌ను నిరాకరించారని అందుకే తాను కారుకు బైబై చెపుతున్నట్లు ఆయన వివరించారు. వికారాబాద్‌లో తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతానని ఆయన ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here