కొలంబో ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన బాంబు పేలుళ్లపై భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవి ంద్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖం డించారు. ఉగ్రమూకలు అమా యకులను టార్గెట్‌ చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి నరమేథాలకు పాల్పడే వారికి నాగరిక సమాజంలో బతికే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంతటి విపత్తును ఎదుర్కొన్న శ్రీలంక ప్రజలకు భారత్‌ అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాంబు పేలుళ్ల మ తులకు ఆయన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. మ తులకు నివాళులు అర్పించారు. ఆ దేశ ప్రజలకు భారత్‌ అన్నివిధాల అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here