Featuredజాతీయ వార్తలు

శాంతి వనంలో రాష్ట్రపతి

అతిపెద్ద ధ్యానకేంద్రాన్ని ప్రారంభించిన రాంనాథ్‌ కోవింద్‌.

పరమార్థం.. పరోపకారం భారతదేశ అంతర్గత వారధులని.. ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడమే మన సంస్కృతి అన్నారు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌. ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హాలో శాంతి వనంలో అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. రామచంద్రమిషన్‌ 75వ వసంతోత్సవాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు గురూజీ కమలేష్‌ పటేల్‌ సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. అనంతరం 40వేల మంది అభ్యాసీలనుఉద్దేశించి ప్రసంగించారు. ”రామచంద్ర మిషన్‌ 75వ వసంతోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ మిషన్కు 150 దేశాల్లో కేంద్రాలు ఉండటం ఆనంద పడుతున్నా. ధ్యాన కేంద్రాల్లో లక్షల మంది అభ్యసిస్తున్నారు. బుద్ధ, మహావీర్‌, నానక్‌, కబీర్‌, వివేకానంద.. ఆధ్యాత్మిక ప్రతినిధులు. కన్హాలోని శాంతివనం పవిత్రమైన స్థలం. శాంతివనంలో లక్షల మొక్కలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో దాదాజీ సేవలు ఎంతోగొప్పవి. దైనందిన జీవితం నుంచి మార్పు కోరుకునే వారికి ఈ కేంద్రం ఉపశమనం ఇస్తుంది. పరమార్థం, పరోపకారం దేశ అంతర్గత వారధులు. ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం మన సంస్కృతి. నిరాడంబర జీవితమే పెద్దలు మనకు చూపించిన మార్గం. ధ్యానం సాధన ద్వారా ఒత్తిడి, అనిశ్చితి నుంచి మానసిక ప్రశాంతత పొందవచ్చు. యువతకు రామచంద్ర మిషన్‌ ఎన్నో సేవలు అందిస్తోంది. దైనందిన జీవితం నుంచి మార్పు కోరుకునే వారికి ఈ కేంద్రం ఉపశమనం ఇస్తుంది” అని చెప్పారు.

ఒత్తిడి ఉంటే ప్రశాంతంగాఉండలేం: కమలేష్‌ పటేల్‌

ఒత్తిడితో ఉన్నవాళ్లు ప్రశాంతంగా జీవించలేరని గురూజీ కమలేష్‌ పటేల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆలోచనలను నియంత్రించడమే ధ్యానం. యోగా, ధ్యానం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలుఎంతో ఊరటనిస్తాయి” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళి సై తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close