బిజినెస్

నేనెక్కడున్నా రుణాలు చెల్లించేందుకు సిద్ధం

  • జెట్‌ పరిస్థితికి.. కేంద్ర ప్రభుత్వమే కారణం
  • ప్రైవేట్‌ సంస్థలపై కేంద్రం వివక్షచూపిస్తుంది
  • నేను లండన్‌లో ఉన్నా.. భారత జైల్లో ఉన్నా రుణమొత్తం చెల్లిస్తా
  • బ్యాంకులే డబ్బును తీసుకోవటం లేదు
  • ట్విట్టర్‌లో విజయ్‌ మాల్యా

లండన్‌ : విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ దీనస్థితికి రావటానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని విజయ్‌ మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశారు. రుణ సంక్షోభంలో కూరుకుపోయి జెట్‌ ఎయిర్‌వేస్‌ మూసివేసే దశకు చేరింది. ఈ సందర్భంగా విజయ్‌ మాల్యా విచారం వ్యక్తం చేశారు. జెట్‌ పరిస్థితికి కేందప్రభుత్వమే కారణమని, ప్రయివేటు సంస్థలపై కేంద్రం వివక్ష చూపిస్తుందని విమర్శించారు. ఒకప్పుడు కింగ్‌ఫిషర్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ గట్టి పోటీ ఇచ్చిందని, అంత పెద్ద ప్రయివేటు ఎయిర్‌లైన్‌ను నేడు ఈ స్థితిలో చూడాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రయివేటు రంగ విమానయాన సంస్థ అన్న ఒకేఒక్క కారణంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని అన్నారు. అదే అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఎయిరిండియాను బయటపడేసేందుకు మాత్రం రూ. 35వేల కోట్లు ఉపయోగించిందని తెలిపారు. మేం పోటీదారులమే అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో నరేశ్‌ గోయల్‌ దంపతులకు సానుభూతి తెలుపుతున్నామని, జెట్‌ కోసం వారెంతో కష్టపడ్డారని మాల్యా అన్నారు.ఈ సందర్భంగా తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు 100శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నానని, కానీ బ్యాంకులే తీసుకోవట్లేదని మాల్యా మరోసారి పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్‌లో నేను భారీ పెట్టుబడులు పెట్టానని, కొద్ది కాలంలో ఎయిర్‌లైన్‌ వేగంగా అభివృద్ధి చెంది దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగిందన్నారు. ఎన్నో అవార్డులు కూడా వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కింగ్‌ఫిషర్‌ రుణాలు తీసుకోవడం నిజమేనని, అయితే వాటిని 100శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతూనే ఉన్నానని, అయినా పట్టించుకోకుండా నాపై నేర అభియోగాలు వేస్తున్నారని మాల్యా ఆవేదన వ్యక్తం చేశారఉ. ఇది ఎయిర్‌లైన్‌ కర్మ అని, బ్యాంకు రుణాలు చెల్లిస్తానని నేను చెప్పినప్పుడల్లా విూడియా నన్ను భారత్‌కు అప్పగించే విషయం గురించి మాట్లాడుతోందని, నేను లండన్‌లో ఉన్నా.. భారత జైల్లో ఉన్నా రుణాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. కానీ బ్యాంకులు ఎందుకు తీసుకోవట్లేదని మాల్యా ప్రశ్నించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close