భూబదలాయింపులకు రక్షణశాఖ సిద్ధం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

రక్షణ శాఖకు సంబంధించిన పలు భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించేందుకు సూతప్రా యంగా సిద్ధంగా ఉందని ఆ శాఖ పేర్కొన్నది. భూముల బదలాయింపుపై లోక్‌ సభలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి రక్షణ శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ గతంలో రక్షణ శాఖ భూములు బదలాయించాలని రక్షణ శాఖను కోరారని లేఖలో పేర్కొన్నది. నూతన సచివాలయ భవనాల సముదాయం నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ భూములు అడిగారని రక్షణ శాఖ తెలిపింది. హైకోర్టులో ఈ విషయంపై కేసు పెండింగ్‌ లో ఉండటం వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నామని రక్షణ శాఖ లేఖలో పేర్కొన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here