సినిమా వార్తలు

తైక్వాండో శిక్షణకు పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో నటిస్తున్న హీరోయిన్‌ పూజా హెగ్డే. ఇప్పటికే అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌తో జత కట్టింది. మహేష్‌తో ఈమె నటించిన ‘మహర్షి’ మే 9న విడుదలకానుంది. ప్రభాస్‌ 20వ చిత్రంలో పూజానే హీరోయిన్‌. కాగా అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమాలో కూడా ఈమె హీరోయిన్‌గా నటించనుంది. కాగా పూజా హెగ్డే త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. ఇది వరకు ‘మొహంజదారో’ సినిమాతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసి పూజా హెగ్డే విఫలమైంది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో కూడా తన లక్‌ను పరీక్షించుకోనుంది. సాజిద్‌ నదియావాలా ఓ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.ఈ సినిమాలో పాత్ర పరంగా ఈ అమ్మడు భారీ యాక్షన్‌ సీన్స్‌లో నటించాల్సి ఉంది. అందుకోసమని ఈ అమ్మడు తైక్వాండో శిక్షణను తీసుకోనుందని సమాచారం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close