డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో పూజా హెగ్డే కారు?

0

%నిన్న హంగామా మధ్య ఘనంగా జరిగిన మహర్షి ప్రీ రిలీజ్‌ తరువాత పూజా హెగ్డే కారు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో చిక్కినట్టు ఫిలిం నగర్‌ గాసిప్‌. ఇది ప్రచారంలోకి రావడానికి కారణం లేకపోలేదు. నిన్న వేడుక తర్వాత పూజా తన మేనేజర్‌ ఇతర స్నేహితులతో కలిసి కారులో ఆఫ్టర్‌ పార్టీ కోసం ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కు బయలుదేరింది. అప్పటికే మేనేజర్‌ కాస్త డ్రింక్‌ చేసి ఉన్నాడట. దీంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో భాగంగా హైదరాబాద్‌ పోలీసులు జరిపిన చెకింగ్‌ లో అతగాడు దొరికిపోయాడు. పూజా హెగ్డే అదే కారులో వెనుక సీట్‌ లో ఉందట. దీంతో ఫోన్‌ ద్వారా వేరే వెహికల్‌ తెప్పించుకుని అక్కడ నుంచి బ్యాచ్‌ మొత్తం మాయమైపోయినట్టు టాక్‌. మేనేజర్‌ తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ తో పాటు కారుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాల్సి వచ్చింది

ఆ కారు ఎవరిది పూజాదా లేక మేనేజర్‌ దా లాంటి వివరాలు తెలియలేదు కానీ ఈ మధ్య ఇలాంటి సన్నివేశాలు సర్వసాధారణం అయిపోయాయి. అప్పుడెప్పుడో ఓ టీవీ మేల్‌ యాంకర్‌ ఇలాగె దొరికితే ఓ రెండు వారాలు అతను అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు పూజా హెగ్డే నిజంగా ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో ఉందో లేదో కానీ మొత్తానికి నిప్పు లేనిదే పొగ రాదు సామెత తరహాలో అందరు సెలెబ్రిటీలు ఉండగా ఒక్క తన గురించి మాత్రమే ఎందుకు న్యూస్‌ వస్తుంది. అరవింద సమేత వీర రాఘవ సక్సెస్‌ తర్వాత మరో బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డేకు మహర్షి మీద మాములు అంచనాలు లేవు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here