ఖరారుకాని పొత్తులు

0

★ హస్తినలో తిష్టవేసిన ఆశావాహులు
★ ‘త్రిశంఖు’లో సీట్ల దుకాణాలు
★ 10 తర్వాతనే జాబితా పరిశీలన
★ కలెక్షన్ ‘కింగ్’లపై ‘నిఘా’ (అనంచిన్ని వెంకటేశ్వరరావు)

న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్కాం: గ్రెసుతో పాటు.. ఆపార్టీతో పొత్తు పెట్టుకునే వర్గాలకు తాత్కాలిక చేదు ‘మందు’ వార్త. తెలంగాణ ఎన్నికల విషయంలో ఏ పార్టీతో ఎన్ని సీట్లు అనే విషయం ఖరారు కాలేదని స్పష్టంగా తెలిసింది. ప్రస్తుతం కాంగీ అధిష్టానం ‘వార్దా’ సమావేశంలో ఉన్నట్లు, ఆ తరువాత ‘వార్’ రూం సమావేశం ఉంటుందని.. అప్పటి వరకు ఎవరూ ఏం మాట్లాడినా.. అది వారి వ్యక్తిగతమని ఏఐసీసీ బాధ్యులు చెప్పారు.
సీట్ల ఖరారు వార్తలపై ఏఐసీసీ అధిష్టానం సభ్యులతో ‘ఆదాబ్ హైదరాబాద్’ వ్యక్తిగతంగా మాట్లాడింది. సీట్ల పేరుతో డబ్బులు దండుకుంటున్న జిల్లా, రాష్ట్ర నాయకులపై అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది.

‘కాంగీదేశం’ ఓకే..:
కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తులపై అధిష్టానం స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే కోదండరాం ఆధ్వర్యంలోని ‘తెజస’.తన స్థాయికి మించి సీట్లు ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. తెజస డిమాండ్ చేసే సీట్ల విషయంలో ‘కాంగీదేశం’ పార్టీలు ఓటుబ్యాంకు పరంగా బలంగా ఉన్నాయి.

‘కొండంత’ సమస్య:
ఇటీవల తెరాసను వీడి కాంగీ తీర్థం పుచ్చుకున్న కొండా దంపుతులు వారసురాలి కోసం అదనంగా సీటును ఆశించడంతో కొత్త సమస్య తలెత్తింది. దీన్ని కిందస్థాయిలో ఆపుచేయాలని కాంగీ స్థానిక నాయకులకు ఆదేశాలిచ్చింది.

ఖమ్మంలో’ ‘చెయ్యి’స్తే…:
సిపిఐ విషయానికి వస్తే ఖమ్మం నియోజకవర్గంలో తెరాస అభ్యర్థితో ‘లోపాయకారి’ ఒప్పందంపై స్పష్టంత రావలసి ఉంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ‘నామా’ పేరుంది. పోట్ల నాగేశ్వరరావు, అయితం రామారావు, ఉద్యోగసంఘ నాయకుడు ఏలూరి పేరును కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఉంది వైరా సిపిఐ ఆశిస్తున్నా కాంగ్రెసు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెంలో సిపిఐ, ఇల్లెందు నుంచి ఊకే అబ్బయ్య పేర్లు అందుబాటులో ఉన్నాయి. సత్తుపల్లి దేశం సిట్టింగ్ కావడంతో సండ్ర వెంకటవీరయ్యకు దాదాపుగా ఖరారైంది.

‘నిజమా’….:
నిజామాబాద్ విషయంలో శాసనసభ మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి తెరాసలో చేరిన నేపథ్యంలో పార్టీకి ఓ పెద్ద తలనొప్పి తొలిగిపోయింది. డీఎస్‌ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆసక్తి చూపుతున్నారు. ఆర్మూర్‌ సీటు విషయంలో కొంత స్పష్టత ఉంది. బోధన్‌ సీటు విషయంలో స్పష్టత ఉంది.
బాల్కొండలో విషయంలో పొత్తుల విషయంలో స్పష్టత వచ్చే వరకు నిర్ణయం తీసుకోరు. నిజామాబాద్‌ అర్బన్‌లో ఇద్దరు నాయకుల మధ్య టిక్కెట్‌ విషయంలో పోటీ నెలకొంది. నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఇప్పటికే పార్టీలో చేరిన అరికెల నర్సారెడ్డితో పాటు భూపతిరెడ్డి పేర్లు ఉన్నాయి. వారసులకు, ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇవ్వరాదని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా యోచిస్తోంది.

అధిష్టానం పరిశీలనలో…:
ఉత్తంకుమార్ రెడ్డి (హుజుర్ నగర్),
జానారెడ్డి (నాగార్జునసాగర్), మల్లు భట్టి విక్రమార్క(మధిర), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ),-డీకే అరుణ (గద్వాల), సంపత్ కుమార్ (అలంపూర్),
రేవంత్ రెడ్డి( కొడంగల్), శ్రీధర్ బాబు (మంథిని), రామ్మోహన్ రెడ్డి (పరిగి), దొంతి మాధవ రెడ్డి(నర్సంపేట), గీతా రెడ్డి(జహీరాబాద్), వంశీచందర్ రెడ్డి (కల్వకుర్తి), చిన్నారెడ్డి(వనపర్తి), జీవన్ రెడ్డి (జగిత్యాల), సుదర్శన్ రెడ్డి (బోధన్), మహేష్ కుమార్ (నిజామాబాద్ టౌన్), షబ్బీర్ అలీ (కామారెడ్డి), మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), జగ్గారెడ్డి (సంగారెడ్డి), సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), దామోదర రాజ నర్సింహ (ఆందోల్), అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి (హుస్నాబాద్), సుధీర్ రెడ్డి (ఎల్.బి.నగర్), కూన శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్), కార్తీక్ రెడ్డి (రాజేందర్ నగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), లక్ష్మారెడ్డి( ఉప్పల్), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), కొండేటి శ్రీధర్ (వర్ధన్నపేట), సీతక్క (ములుగు), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), రామచంద్రనాయక్ (డోర్నకల్), విజయరామారావు (స్టేషన్ ఘనపూర్), జంగా రాఘవరెడ్డి (పాలకుర్తి), గుగులోతూ సుచిత్ర బాలు నాయక్ (మహబూబాబాద్), రేగా కాంతారావు (పినపాక), బిక్షమయ్య గౌడ్ (ఆలేరు), కుంభం అనిల్ రెడ్డి (భువనగిరి), బిల్యానాయక్ (దేవరకొండ), రఘువీరా రెడ్డి (మిర్యాలగూడ), నాగం జనార్దన్ రెడ్డి (నాగర్ కర్నూల్), డాక్టర్ వంశీకృష్ణ (అచ్చంపేట), పవన్ కుమార్ రెడ్డి (దేవరకద్ర), ప్రతాపరెడ్డి.(షాద్ నగర్), ఎల్లేని సుధాకర్ రావు(కొల్లాపూర్), శివ కుమార్ రెడ్డి (నారాయణపేట),
రమేష్ (తాండూరు), ఆరెపల్లి మోహన్ (మానకొండూరు), శ్రీశాంక్ ( సికింద్రాబాద్ కంటోన్మెంట్), విజయ రమణారావు (పెద్దపల్లి), మహేందర్ రెడ్డి (సిరిసిల్ల), బోడ జనార్ధన్ (చెన్నూరు), ఆత్రం సక్కు (అసిఫాబాద్), సోయం బాబూరావు (బోథ్),
శశిధర్ రెడ్డి (మెదక్), ప్రతాపరెడ్డి (గజ్వేల్), అద్దంకి దయాకర్ (తుంగతుర్తి), మేడిపల్లి సత్యం (చొప్పదండి) వీరి పేర్లతో కూడిన జాబితా అధిష్టానం వద్ద ఉంది. ఇదిలా ఉండగా… సీట్లు రాక తెరాస నుంచి ఎవరైనా వస్తే వారికి ‘పదవీ తివాచీ’ పరిచి ఇప్పటికే పరిశీలనలో ఉన్న వారికి మరో పదవి చూపే అవకాశాలను అధిష్ఠానం తీవ్రంగా పరిశీలిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here