Featured

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 85శాతానికి పైగా పోలింగ్‌ నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.. ఇదిలా ఉంటే తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల టీఆర్‌ఎస్‌, విపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. జనగామ జిల్లా రఘునాథపల్లిలో పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో ఆ మార్గం గుండా హైదరాబాద్‌ వెళుతున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య వాహనాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డుపై బఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పి.. పరిస్థితిని చక్కదిద్దారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాల్లో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 4135 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. 10,668 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవంకానున్నాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,342 సర్పంచి స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది.

జిల్లాల వారిగా నమోదైన పోలింగ్‌ శాతం..

ఖమ్మం 73.35 శాతం, నల్లగొండ 65 శాతం, సూర్యపేట 77 శాతం, పెద్దపల్లి 67.30 శాతం, రంగారెడ్డి 65.3 శాతం, కరీంనగర్‌ 64 శాతం, యాదాద్రి 63 శాతం, కామరెడ్డి 81.78 శాతం, నిజామాబాద్‌ 69.38 శాతం,వనపర్తి 80 శాతం, నాగర్‌ కర్నూల్‌ 76 శాతం, జోగులాంబ గద్వాల 78 శాతం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా 87 శాతం, జనగామ 90 శాతం, భూపాల్‌ పల్లి 83శాతం ఓట్లు నమోదయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,342 సర్పంచి స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. పలుచోట్ల ఫలితాలురాగా, మరికొన్నిచోట్ల లెక్కింపు సాగుతోంది. మధ్యాహ్నం 2గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత గ్రామ పంచాయతీ

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాత్రివరకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విడుతలో 4,135 గ్రామాల్లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతోపాటు, కోర్టు కేసుల నేపథ్యంలో ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ విడుతలో మొత్తం 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,342 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించగా, 10,668 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. 36,602 వార్డుస్థానాలకు

ఎన్నికలు జరుగాల్సిఉండగా, కోర్టు కేసులు, రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో 94 వార్డుల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 26,191 వార్డులకు పోలింగ్‌ నిర్వహించగా, 63,480 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు చాలాచోట్ల టిఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయదుందుభి మోగిస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close