రైతు ట్రెండ్‌గా మారిన రాజకీయం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాలం మారినా కొద్ది మనుషులు మారాలీ.. మను షులు మారినా కొద్ది సమాజంలో మార్పు రావాలి.. కానీ అందరు రాజకీయ నాయ కులు, ప్రభుత్వాలాలూ ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. దేశంలో కొత్తగా ట్రెండు అంతా ఇప్పుడు రైతుల వైపు మళ్ళింది. అయితే దేశానికి అన్నంపెట్టే రైతులను అన్ని విధా లుగా ఆదుకుంటామని కొందరూ.. రైతు లేందే రాజ్యం లేదని మరి కొందరూ.. అన్నదాతలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులు ఇంకొందరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ ఒక్క లీడరు, ప్రతీ ఒక్క అధికారి, ప్రతీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రైతులపై ఓ కన్నేసి చూస్తున్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది కర్షకుల పరిస్థితి. అటు వార్షిక బడ్జెట్‌ అనీ, ఇటు మద్యంతర బడ్జెట్‌ అంటూ వేల కోట్లతో రైతులకు అన్ని పథకాలు చేపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వాలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వెళ్ళువెత్తుతున్నాయి. అయితే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నామని, రైతును ఆదుకోవడమే తమ ప్రభుత్వ ద్యేయమని అటు మంత్రులు ఇటు అధికారులు కోకోళ్ళలుగా వాగ్ధానాలు చేస్తూనే ఉన్నారు. దేశం మొత్తం ఇప్పుడు రైతు వైపే చూస్తోంది. కానీ రైతులకు పాలకులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎకరానికి రూ. 4 వేల రూపాయల చొప్పున రైతు బందు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. అయితే పాపం రైతుల పరిస్థితి చూస్తే మరీ దీనంగా కనిపిస్తోందని, నాలుగు వేల రూపాయలను ఎరచూపిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు మళ్ళీ ప్రజలు పట్టం కట్టారని, అయితే ఆ ఎరలో రైతులు పావులయ్యారని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బందు పథకాన్ని ప్రవేశ పెట్టగానే కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభ్వుం కూడా కిసాన్‌ సమ్మన్‌ పేరుతో దేశ వ్యాప్తంగా రైతులకు నేరుగా ఖాతాలోకి డబ్బులు వేసే పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే రైతలు పండించే పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించాలి కానీ ఈ నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు ఒరిగేదేమి లేదని రెండు వేల రూపాయలు వస్తే అట్టి డబ్బులు రైతుకు ఎందుకు పనికివస్తాయని విమర్శిస్తున్నారు.

గిట్టు బాటు ధరలు లేక … పెట్టుబడి రాకా…

ఆరు కాలం రాత్రనకా పగలనకా కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. వేలల్లో పెట్టుబడులు పెట్టి దిగుబడి తగిన ఫలితం రాకపోవడంతో ఎంతో మంది అన్నదాతలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పాలకులు, ప్రజా ప్రతినిధులు మాత్రం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెబున్నప్పటికి వారి మాటలు ఆచరణ సాధ్యం కావడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతం పత్తి, వరి దాన్యం, మిర్చి, పసుపు, మొక్కజొన్న, అరటి తదితర ఆరుతడి పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. అయితే రైతులు పండించిన ఏ పంటైనా మార్కెట్‌లలోకి వెళితే దళారులదే రాజ్యం అవుతోంది తప్పా అసలు కర్షకులకు పైకం నరకం అవుతోందని అన్నదాతలు మొత్తుకుంటున్నారు.

గత నాలుగు సంవత్సరాల క్రితం పత్తికి క్వింటాళుకు రూ.6 వేల వరకు ఉండేది.  ప్రస్తుతం పత్తి ధర క్వింటాళుకు రూ. 4 వేల నుండి 5 వేల 300 రూపాయలకు వరకు మాత్రమే పలుకుతోంది.  మిర్చి పంట విషయానికొస్తే గతంలో రూ. 11 వేల నుండి 13 వేల రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం మిర్చి కి కూడా క్వింటాళుకు రూ. 5 వేల 500 నుండి రూ. 6 వేల 800 వరకు మాత్రమే ధర పలుకుతోంది. అయితే పసుపు పంటకు మాత్రం పూర్తిగా ధర డీలా పడిపోవడంతో పసుపు రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు ఇక అరటి రైతుల విషయంలో దళారులు పూర్తిగా అన్యాయం చేస్తూ గతంలో గెల లెక్కన కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పచ్చి అరటి కాయలను కాడలుగా విడదీసి కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కిలోకి కేవలం రూ.6 నుండి 8 రూపాయల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో లక్షల పెట్టుబడి పెట్టిన రైతులకు కనీసం వేలల్లో కూడా రాకపోవడంతో కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక మొక్కజొన్న, ఎర్ర జొన్న, వరి దాన్యం విషయంలో మాత్రం రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతోందనే చెప్పవచ్చు. ప్రభుత్వాలు రైతులపై కపటప్రేమను ఒలక బోస్తూ గిట్టు బాటు ధరలు కల్పించడంలో విఫలమవుతున్నాయనే చెప్పవచ్చు. రైతల ఎకౌంట్లలోకి నగదు బదిలీ చేసే బదులు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే సన్నా, చిన్న కారు రైతులతో పాటు మద్యతరగతి రైతులు కూడా అన్ని విధాలుగా ఆనంద పడుతారనే వాస్తవాలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో రైతులకు ఏ చిన్న అన్యాయం జరిగినా రైతు సంఘాలు అనేవి ఉండేవి. అలాంటి రైతు సంఘాలు ప్రభుత్వాలతో కొట్లాడి అవసరమైతే రైతుల పట్ల నిలబడి ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేయించి మీరీ మద్దతు ధరలను కల్పించేవి. కానీ ప్రస్తుతం రైతు సంఘాలు కంటికి కూడా కనిపించకుండా పోయాయి. ఒకటో రెండో రైతు సంఘాలు ఉన్నప్పటికి ఎవరి స్వార్దం వారుగా మారిపోయి స్వలాభాల కోసం పాకులాడుతున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం రైతు సంఘాలు కాదు కదా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రైతులకు సమన్యాయం చేస్తామంటూ ముందుకు వస్తున్నాయి. కానీ అది సమన్యాయంగా అనిపించడం లేదని రైతు బందులు, కిసాన్‌ సమ్మన్‌ వంటి పథకాలు మద్యతరం వరకే ఉంటుందని అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బందు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని, అట్టి పథకం మళ్లీ ధనికులకే ఉపయోగపడేలా ఉన్నదని విమర్శకులు అంటున్నారు. రాష్ట్రంలో ఒకటి నుండి 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే వారికి ఎకేవలం ఎకరాకి రూ.4 వేలు మాత్రమే వస్తుంటాయి. కానీ 5 ఎకరాల నుండి వందల ఎకరాల వరకు ఉన్న రైతులు, భూసాములు కూడా ఎక్కువగానే ఉన్నారు. వారికి లక్షల్లో రైతు బందు డబ్బులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ధనికుడు ధనికుడిలాగానే పేద వాడు పేదవాడి లాగానే ఉంటున్నారు. అయ్యా పిఎం, సీఎం లు నగదు బదిలీలు కాదు సార్‌.. పంటలకు గిట్టు బాటు ధరలు కల్పించండీ చాలూ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here