Uncategorized

రాజకీయం రసవత్తరమే

దూకుడు పెంచిన బిజెపి..

ఖండిస్తున్న ఎంఐఎం…

ఎటూ స్పందించని స్థితిలో టిఆర్‌ఎస్‌…

హైదరాబాద్‌ ఉగ్రవాదుల అడ్డాగా మారిపోయిందా… మారిపోతుందా అంటే, మారిపోయిందనే సమాధానాలు వినిపిస్తున్నాయి.. నగరంలో ఎక్కడ ఏ మూలకు స్థావరం ఉందో పూర్తి వివరాలతో సహా నిరూపిస్తానని కేంద్రమంత్రి ఆరోపిస్తుంటే తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ ఎందుకు స్పందించడం లేదనేదే ఇప్పుడు ఆసక్తికరంగా వమారిపోయింది. కేంద్రమంత్రి ఆరోఫణలకు స్థానిక ఎంఐఎం నేతలు స్పందించి ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. ఆ పార్టీ తీరే అంతని లేని పోని వాటికి అభూత కల్పనలు కల్పించి ప్రచారం చేస్తుందని వారు మాటకు మాటతో విభేదించారు. మరీ ఇరు పార్టీలు ఇలా తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంపై ఆరోపణలు చేస్తుంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎందుకు స్పందించడం లేదనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఒక పార్టీ టిఆర్‌ఎస్‌కు మిత్రపార్టీగా పేరుపోయింది. మరో పార్టీ దేశంలోనే అత్యథిక మెజారిటితో దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ఎవరూ మాటలను ఖండించినా, ఎవరి ఆరోపణలను తప్పుపట్టినా తెలంగాణలో పార్టీకి మొదటికే మోసం వచ్చేలా ఉందని ఆలోచనతో కెసిఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఎవరూ ఏ ఆరోపణలు చేసినా వెంటనే స్పందించే టిఆర్‌ఎస్‌ నేతలే ఉగ్రవాదుల అడ్డాగా మారిపోతుందనీ ఆరోపణలు వస్తున్నా స్పందించడం లేదంటే ఏదో బలమైనా కారణాలు ఉన్నాయనే అర్థమవుతోంది. వెనక్కిపోతే ఒక బాధ, ముందుకు వెళితే మరో బాధలో చిక్కుకుంటామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

నిజంగా హైదరాబాద్‌ ఉగ్రవాదులు అడ్డాగా మారిపోతుందా.. ఇన్నిరోజులు చప్పుడు చేయని బిజెపి నాయకులు మళ్లీ అధికారంలోకి వచ్చాకనే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనేదే మరో ప్రశ్న. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన అస్త్రంగా వాడుతున్నట్లు తెలుస్తోంది. వాద, ప్రతివాదనలతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది… మాటల తూటాలు కాదు ప్రత్యర్థి పార్టీని చిత్తు చేయడానికి ఒక్కొక్క బాణాన్ని అదునుచూసి వదులుతున్నారని అర్థమవుతూ ఉంది.. జాతీయ పార్టీ బిజెపి, హైదరాబాద్‌ ఎంఐఎం ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటుంటే తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ ఎందుకు స్పందించడం లేదనేదే ఇప్పుడు అసలు సమస్యగా మారిపోయింది. మౌనం అంగీకారమనుకోవాలా, లేదా ఒకవైపు స్పందిస్తే మరొవైపు లేనిపోని తలనొప్పులు వస్తాయనుకుంటుందో ఏమో కాని కెసిఆర్‌ ప్రభుత్వం అన్ని చూస్తూ, అన్ని వింటూ ఏం స్పందించాలో తెలియని స్థితిలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఎటు మాట్లాడుతే ఎక్కడికి దారితీస్తుందో అనే సందేహంలో మన యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయం అంటేనే ఎవ్వరిని నొప్పించకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే.. కాని తెలంగాణలో రాజకీయం వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి.. అధికారంలో ఉన్నపార్టీకి ఎంఐఎం మిత్రపార్టీగా ఉంది, బిజెపి జాతీయపార్టీగా ఉంది. వీరిరువురి మధ్యలో కెసిఆర్‌ ఎక్కడ తలదూర్చినా టిఆర్‌ఎస్‌కు మొదటికే మోసం వచ్చేలా ఉందని తెలుస్తోంది. ఒక వేళ ఆరోపణలపై స్పందించకుంటే బిజెపి చెప్పిందే నిజమని నమ్మే అవకాశం ఉంది.. అందుకే ఇప్పుడు ఏలా స్పందించినా ప్రభుత్వ యంత్రాంగం ఇబ్బందుల్లో పడబోతున్నట్లు తెలుస్తోంది…

ఏలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి…

బిజెపి చేసిన ఆరోపణలు ఖండిస్తే తెలంగాణ ప్రజలకు వేరేలా అర్థం వెళ్లిపోతుంది. అధికారంలో ఉన్న బిజెపి పక్కా ఆధారాలతో చెబుతే కెసిఆర్‌ ఖండిస్తున్నారని అంటే ఎంఐఎం వాళ్లు మిత్ర పార్టీ కావడ వలన వారికి మద్దతుగా మాట్లాడుతున్నారని బిజెపి ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. మెజారిటీ ప్రజలంతా హిందువులే కావడంతో బిజెపి చెప్పే ఆధారాలను నమ్మి పార్టీకి మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ హైదరాబాద్‌లో నిజంగానే ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయని ప్రభుత్వ యంత్రాంగం స్పందించినా ఎప్పటినుంచో కలిసి ఉంటున్న మిత్ర పార్టీ ఎంఐఎం దూరమవుతోంది. అవకాశం కోసం ఇన్నిరోజులు ఎంఐఎం పార్టీని వాడుకొని ఇప్పుడు ఆ పార్టీని దూరం కొట్టారని ప్రతిపక్షపార్టీ ఆరోపణలు చేస్తూ ఎంఐఎం కు దగ్గరైతే అప్పుడు మిత్ర పార్టీ దూరమవుతోంది. ఇన్ని రోజులు ఉగ్రవాదుల నిర్మూలనకు తెరాస ప్రభుత్వం ఏం చేయలేదనే ఆరోపణలు ప్రజల్లోకి వెళతాయి. అందుకే అధికార పార్టీగా ఏలా స్పందించాలో అర్థం కాకుండా ఉందని తెలుస్తోంది.. ఇప్పుడు ఇలా స్పందించకుండా ఉంటే రేపు మళ్లీ ఏదో ఆరోఫణలు చేస్తూ దానికి తగ్గట్లు రుజువులు చూపిస్తే ఏలా అనేది అర్థంకాని పరిస్థితి. అందుకే ఎవ్వరిని ఏమనుకుండా నిధానంగా పార్టీ పరువును, ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు ఏలా వెళ్లాలనేదే ఇప్పుడు కెసిఆర్‌ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది..

రాష్ట్రంలో పాగా వేయాలి…

తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలి. పార్టీని బలంగా నిర్మాణం చేయాలి.. అందుకే మన దగ్గర ఉన్నా ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తూ, ఆ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు అనుకునే పార్టీ ఒకరిది. లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రశాంతమైన నగరాన్ని చెడు పేరు తెస్తున్నారని ఖండిస్తున్న పార్టీ ఇంకొటి.. వారు ఇరువురూ అలాగే వాదించుకుంటారు మనదే రాబోయే పరిపాలన అంటూ మరొకరిది ఇంకో వాదన. ఎవరికి వారు బలంగా వాదించుకున్న హైదరాబాద్‌నగరంలో ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పరచుకొని దాడులకు తెగపడుతున్నారని కేంద్ర సహయ మంత్రి ఆరోపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా టిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ఎందుకు స్పందించడం లేదనేదే ఇప్పుడు రాష్ట్రప్రజలందరిలో ఉన్న అనుమానం. ప్రతిపక్షాలు, జాతీయ నాయకుల ఆరోపణలకు వెంటనే స్పందించే తెరాస నాయకత్వం ఇప్పుడు మాత్రం మౌనంగానే చూస్తూ ఉంది. అదునుచూసి బిజెపి ఒక్కొక్క అస్త్రం ఉపయోగిస్తూ టిఆర్‌ఎస్‌ పార్టీని సందిగ్దంలో పడేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కెసిఆర్‌ ఏలా స్పందిస్తారో, బిజెపి అస్త్రాలను దాటుకుంటూ ఏలా ముందుకు పోతారనేదీ ఇప్పుడున్న అసలు సమస్యగా గుర్తిస్తున్నారు..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close