Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

కర్నాటకలో మళ్లీ రాజకీయ కలకలం

బెంగళూరు : కర్ణాటకలో మళ్లీ రాజకీయ కలకలం చెలరేగుతోంది. ఎమ్మెల్యేలతో బేరసారాలు నడుస్తున్నాయన్న వార్తులు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) సర్కార్‌ను గ్దదెదింపేందుకు ‘ఆపరేషన్‌ కమల్‌’ పేరుతో బీజేపీ తాజా ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న వార్తలు తాజాగా దుమారం రేపుతున్నాయి. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తాజా ప్రయత్నాలు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల వ్యూహం కూడా ఇందులో భాగంగానే వారు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మకర సంక్రాంతి తర్వాత కర్ణాటకలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వారంటున్నారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే బీజేపీకి చిక్కులు తప్పవని పార్టీ హైకమాండ్‌ భావిస్తోంది. కర్ణాటక నుంచి గరిష్ట సంఖ్యలో సీట్లు గెలుచుకోవడం పార్టీకి అవసరం కావడంతో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే అది సాధ్యమవుతుందని కమలదళ నేతలు భావిస్తున్నారు. కూటమి సర్కార్‌ అధికారం కోల్పోతే, జేడీఎస్‌ ఒంటరిగా పోటీ చేయడమో, ఉనికి కోసం ఎన్డీయేలో చేరడమో జరుగుతుంది. కాంగ్రెస్‌ నైతికస్థైర్యం దెబ్బతింటుంది. ఆ కారణంగానే బిజెపి నేతలు గతంలో ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది.

కాగా, ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ ముంబైకి తరలించిందని, వారు కనిపించడం లేదని కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ ఆరోపించారు. గత ఏడాది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి అరడజనుకు పైగా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని, వాటిని తాము విఫలయం చేశామని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్‌ నుంచి ఉద్వాసనకు గురైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేష్‌ ఝారకోలిని ఉపయోగించుకుని మద్దతు సవిూకరణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఝారకోలి తన వైపు 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఇంతవరకూ ఇద్దరు తన వైపు తిప్పుకోగలిగారని, గుల్బర్గాకు చెందిన మరో ఎమ్మెల్యే ఉమేష్‌ జాదవ్‌కు కూడా అటువైపు మళ్లే అవకాశాలు లేకపోలేదని వారంటున్నారు. పార్టీ ఫిరాయించేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు బీజేపీ ఆఫర్‌ చేస్తోందని గతవారంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణ చేశారు. జేడీఎస్‌కు చెందిన 37 మంది ఎమ్మెల్యేల్లో చీలక తేవడం కష్టమని భావిస్తున్న బీజేపీ, ఉత్తర కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. న్యూఢిల్లీలో ఉన్న ఏ పార్టీకైనా కర్ణాటక పాడిఆవు లాంటిందని, లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)ను ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు ఆరోపించారు.

బీజేపీ ప్రయత్నాలను వమ్ము చేస్తాం

రోవైపు, బీజేపీ ప్రయత్నాలు మరోసారి వమ్ముకాక తప్పదని జేడీఎస్‌ సుప్రీం హెచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు-ముఖ్యమంత్రి కుమారస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవు లిస్తామంటూ వాగ్దానం చేయడం ద్వారా వారు గోడదూకకుండా చూసే ప్రయత్నాల్లో జేడీఎస్‌ ఉంది. 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 80 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్‌కు 37, బీఎస్‌పీకి ఒకటి, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. వీరంతా కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, కనీసం 14 మంది కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే అధికారాన్ని బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంటుంది.

కర్నాటకలో ప్రభుత్వానికి ఢోకాలేదు: డిప్యూటి సిఎం

కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ప్రభుత్వం పడిపోయే ఛాన్సే లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర స్పష్టం చేశారు. ప్రభుత్వం పడిపోతోందని బీజేపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముగ్గురు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో టచ్‌ లో ఉన్నారని, ఓ ¬టల్లో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని ఎవరూ చెప్పడం లేదన్నారు. ఈ వార్తలు ఊహగానాలే అని ఆయన స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని పరమేశ్వర తేల్చిచెప్పారు. ఇవాళ తమ మంత్రులతో బడ్జెట్‌ పై సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close