Featuredస్టేట్ న్యూస్

రేణుక ఓటమికి రాజకీయ కుట్ర

-వక్ర సంబందాలు ˜

-30 కోట్ల పెట్టుబడి

  • కాంగీ కోవర్టులు

అనంచిన్ని వెంకటేశ్వరరావు, (ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎట్టకేలకు కోవర్టుల తెరలు నెమ్మది.. నెమ్మదిగా.. తొలుగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూనే ఆ పార్టీని ‘ఉట్టి’ ముంచే కుట్ర సమర్థవంతంగా.. సమన్వ యంతో… దగ్గరుండి… జాగ్రత్తగా… ఓర్పుతో, నేర్పుతో.. నమ్మకంగా ఈ కుట్ర జరిగింది. ఆ దౌర్భాగ్యుల నయ వంచ నలు ఒకొక్కటిగా స్వేచ్ఛగా బయట పడుతున్నాయి. ఆ కుట్రలో ఇంటి దొంగలే భాగస్వాములు కావడం ఆ అమాయక రేణుకమ్మ తల్లికి తెలియదు. తెలిసే అవకాశం లేకుండా.. పక్కాగా పన్నాగం చక్కగా పన్నారు. ఆ నమ్మక ద్రోహులు అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా సాంకేతికంగా తీసుకున్నారు. ”తడి గుడ్డ లేకుండానే తలలు నరుకు’థూ’ వినోదం చూసే దౌర్భాగ్య వింత వైనం” ఇది. రాజకీయ నాయకులకు ఈ కుట్ర గురించి తెలిస్తే…. ‘నేను ఈ క్షణం బతికే ఉన్నానా’ అనే శరీరక పరీక్షలు చేయించుకోవడం తథ్యం. సాక్ష్యాలు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’కు దొరికాయి కాబట్టి సరిపోయింది. లేకుంటే ధర్మం నాలుగు పాదాలతో నడవటం… కాదు.. వీళ్ళు తమ కృత్రిమ పాదాలతో.. ధన దాహంతో.. రక్త పిశాచాలతో.. శ్మశాన నృత్యం తన్మయత్వంతో చేస్తారు. ఈ ని’కృష్టు’ల దాష్టీకం ఇది.

పట్టు’భట్టి’మరీ..: ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత సినిమా మారింది. సీను సిటారైంది. ఎంపీగా పోటీ చేయాలంటే… ఎవరు నమ్మకస్తులనే విషయంలో ఏఐసీసీ అధిష్టానం అంత త్వరగా తేల్చుకోలేకపోయింది. ఇక తప్పనిసరిగా సీనియర్లను రంగంలోకి దించాలని భావించింది. ఈ పరిక్రమణలో రేణుకాచౌదరి రేసులో ముందుంది. ఇది స్వంత పార్టీలోనివర్గాలకు మింగుడుపడలేదు. ‘బకరా’ లైతే ప్రత్యర్థుల దగ్గర మాట్లాడుకున్న ‘డీల్‌’ ఓకే అనుకున్నారు. సీన్‌ రివర్స్‌ అయింది.

ఇదీ కుట్ర వెనుక పన్నాగం: కాంగ్రెస్‌ శ్రేణులు సైతం ఖంగుతినే నిజం. తప్పదు. రేణుకాచౌదరీని ఓడిస్తే జడ్పీటీసీ, ఎంపీటీసీల ఆశ చూపారు. అది ప్రత్యర్థి పార్టీలైతే తప్పు లేదు. కానీ సొంత పార్టీల వారే కావడం గమనార్హం. ఇలా సుమారు పాతిక మంది ద్వితీయ శ్రేణి నాయకులు గడ్డి తిన్నారు. ఇందులో ప్రధానంగా మధిర , వైరా, కొత్తగూడెం, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో జరిగింది. పోలింగ్‌ బూతుల వారీగా ఈ ఒప్పందాలు జరగటం నివ్వెరపరిచే విషయాలు. అందుకే కొందరు బూత్‌ స్థాయి నాయకులు ఫాం-17 ఇవ్వకపోవడం గమనార్హం.

ఇదో విచిత్రం: రాష్ట్రంలో రాజకీయ ప్రధాన ప్రత్యర్ధులు తెరాస కాంగ్రెస్‌ లే. అయితే రేణుకాచౌదరిని ఓడించేందుకు ఆమె నామినేషన్‌ కంటే ముందే పథకం వేగంగా సిద్దమైంది. అందులో భాగంగా ‘నామా’తో కాంగ్రెస్‌ వైరి వర్గాలు ఖమ్మంలోని పి.మురళీ అధ్యక్షతన ఓ పారిశ్రామిక కేంద్రంలో సమావేశం అయ్యారు. టిపిసిసి కీలక సభ్యులు ఒకరు హైదరాబాద్‌ నుంచి ఈ సమావేశాన్ని ‘మానటరింగ్‌’ చేయడం గమనార్హం. ఇది తెలియని రేణుక దగ్గర ఉద్యోగులు ఒకరు ‘నామా’ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇది రేణుకమ్మ నామినేషన్‌ దగ్గర బయట పడింది. అయితే రాధాకిషోర్‌, దీపక్‌ చౌదరీ, రామారావు, ఛోటాబాబా, శ్రీనివాస్‌ యాదవ్‌, సుబ్బారెడ్డి, ఇతర బంధు వర్గాలతో ఆ సంఘటన పెద్దగా కన్పించలేదు. ఎన్నికల ప్రచార సామాగ్రి విషయంలో ఆలస్యం జరిగింది. అయితే రేణుకాచౌదరి చేసిన పర్యటనలతో హఠాత్తుగా పరిణామాలు మారాయి. అయితే ‘నామా’ వద్ద డబ్బులు తీసుకున్న తృతీయ శ్రేణి నాయకులు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బయటపడ్డారు. వీరు ఏకంగా తెరాస బలపరుస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకోవడం విశేషం.

బూత్‌ ‘డప్పులు’: పబూతుల వారీగా కార్యకర్తల ఖర్చుర కోసం ఏర్పాటు చేసిన మొత్తంలో కొందరు ఇచ్చిన దానికి లెక్కకు తక్కరావడం జరిగింది. ఇందులో చాలా మంది నాయకులు ‘నామా’ నుంచి ఆర్థక లాభం సుమారు 30 కోట్ల వరకు పొందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మధిర నియోజకవర్గ సభ్యులు నిర్థారించారు.

శభాష్‌ రేణుక

గత పదేళ్ళుగా దేశంలో ప్రతి ఎన్నికల్లో ధన ప్రభావం భారీగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి నగర ప్రాంతంలో వేయి, పల్లె ప్రాంతాల్లో ఐదు వందలు పంచి పెట్టినట్లు తెలుస్తోంది. సాదా సీదాగా 10కోట్లు ఖర్చు పెడితే.. కాంగ్రెస్‌ గెలిచే సీటు. రేణుకాచౌదరి మాత్రం ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఇది ఖమ్మం ప్రజానీకానికి ఆసక్తితో కూడిన ఆశ్చర్యం కలిగించింది. ఈ సహ సోపేతమైన చర్య దేశ వ్యాప్తంగా తీవ్ర మైన చర్చకు దారి తీసింది. ఈ సమయంలో కాంగ్రెసులో ఉన్న తెరాస కోవర్టులు రేణుకాచౌదరిపై డబ్బు పంచడం లేదని అవాకులు చెవాకులు పేలారు. అయితే స్థానిక ఎన్నికల్లో ఈ నాయకులు గ్రామాల్లో మొఖం. చాటేయ్యండం జరుగుతుంది. రేణుకాచౌదరి గెలిస్తే.. ఒక్క పైసా ఖర్చ చేయకుండా కాంగ్రెస్‌ గెలిచే స్థానంగా రికార్డ్‌ సృష్టిస్తుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close