Featuredప్రాంతీయ వార్తలు

పోలీస్‌ శౌర్య పురస్కారం అందుకున్న షాద్‌నగర్‌ పోలీసులు

షాద్‌నగర్‌ పోలీసుల ధైర్య సాహసాలకు ప్రభుత్వ ఉత్తమ పురస్కారం

జనాల మధ్య చిరుత పులి సెన్సేషన్‌ ఘటనలో పురస్కారం

షాద్‌ నగర్‌ ఏసీపీ సురేందర్‌, సిఐ శ్రీధర్‌ కుమార్‌,

ఎస్సై కష్ణకు ఉత్తమ పురస్కారం

షాద్‌ నగర్‌, (ఆదాబ్‌ హైదారాబాద్‌): జనావాసాల మధ్య చిరుతపులి ప్రవేశించి సంచలనం స ష్టించిన ఈ సంఘటనలో ఏ ఒక్క పౌరునికి గాని చిన్న హానీ జరగకుండా జనాల మధ్యలోనే పులిని చాకచక్యంగా పట్టుకొని జూ కు అప్పజెప్పిన సంఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పోలీసులకు ప్రభుత్వ ఉత్తమ పురస్కారం లభించింది. 71వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవల్ని అందించిన అధికారులకిచ్చే పురస్కారాల్లో మన షాద్‌ నగర్‌ సత్తా చాటింది. ఈ ఏడాది ప్రకటించిన శౌర్య సాహసాల పురస్కారాల్లో షాద్‌ నగర్‌ పోలీస్‌ శాఖ ఈ గౌరవాన్ని దక్కించుకున్నది. ఈ సంతోషకరమైన విషయాలను హలో షాద్‌ నగర్‌ ద్వారా తెలుసుకుందాం. ఈ ఉత్తమ పురస్కారాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌ అధికారులకు అందజేశారు. షాద్‌ నగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) వి. సురేందర్‌, పట్టణ సిఐ శ్రీధర్‌ కుమార్‌, ఎస్సై క ష్ణలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రశంసా పత్రాలు అందజేశారు. అదేవిధంగా చిరుత పులిని అడుపుచేసే క్రమంలో గాయపడ్డ కానిస్టేబుల్‌ లక్ష్మయ్యకు ప్రశంసా పత్రంతో పాటు రూ.5వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఇటీవల షాద్‌ నగర్‌ పట్టణంలోని పటేల్‌ రోడ్డు లో మన్నే విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఇంటిపై చిరుత పులి వచ్చి చేరింది జనావాసాల మధ్య చిరుతపులి రావడం దీంతో ప్రజలు భయకంపితులై అయ్యారు ఈ సమాచారం అందుకని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న సురేందర్‌ సీఐ శ్రీధర్‌ కుమార్‌ ఎస్సై క ష్ణ తదితర సిబ్బంది చిరుతపులి పట్టుకునే క్రమంలో పూర్తి ధైర్యసాహసాలను ప్రదర్శిం చారు ముఖ్యంగా పులిని అదుపులోకి తీసుకునే క్రమంలో లో పోలీసులు పోలీసులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారు పులి తప్పించుకొని జనాల మధ్య తిరుగుతూ ఉంటే ఆ మ గం ఎవరి పై దాడి చేయకుండా ప్రజల్ని కాపాడుకుంటూ ప్రాణాలకు తెగించి పులిని అదుపు చేశారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా రెస్క్యూ టీం షాద్‌ నగర్‌ పోలీసులు సంయమనంతో ఎవరికీ చిన్న హాని కూడా జరగకుండా చేపట్టిన చర్యల్ని ప్రభుత్వం ప్రశంసించింది. అందుకే ధైర్య, సాహసాలు ప్రదర్శించే పోలీసులకు ఇచ్చే అవార్డులో భాగంగా ఈ అవార్డును ప్రకటించారు. చిరుతపులిని బందించే సమయంలో వారు చూపిన అసాధారణమైన ధైర్య సాహసాలకు ఈ పురస్కారం ప్రకటించినట్టు అధికారులు పేర్కొన్నారు. షాద్‌ నగర్‌ పోలీసులు అడవి మ గాలనే కాదు మానవ రూపంలో ఉన్న మ గాలను కూడా అదుపు చేసి ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా శభాష్‌ అనిపించుకున్న విషయం తెలిసిందే. షాద్‌ నగర్‌ పోలీసుల ధైర్య సాహసాల్ని ప్రజలు కొనియాడుతున్నారు. సూపర్‌ పోలీస్‌ గా షాద్‌ నగర్‌ పోలీసులు చరిత్రకెక్కారు. ప్రజల్లో వీరి ధైర్య సాహసాలకు రియల్‌ హీరోలుగా పేరు పొందారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close