ఆయేషా మీరా హత్య కేసులో పోలీసు అధికారుల సంపాదనపై కూపీ

0

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఏపీలో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్ధిని ఆయేషావిూరా హత్య కేసులో శుక్రవారం ఉదయం నుంచి సత్యం బాబును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇబ్రహీం పట్నంలోని శ్రీదుర్గా హాస్టల్‌ నిర్వాహకులను సీబీఐ అధికారులు త్వరలో విచారించనున్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం లోని శ్రీదుర్గ లేడీస్‌ హాస్టల్లో 2007 డిసెంబర్‌ 27 న బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా విూరా హత్యకు గురైంది. ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కేసును విచారించిన పోలీసులు.. సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనే ప్రధాన నిందితుడని చెప్పారు. కాగా న్యాయవిచారణా అనంతరం 31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించింది. అయేషా విూరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిగా బయటపడ్డాక.. అసలు దోషి ఎవరనే ప్రశ్న తలెత్తింది. సత్యంబాబు దోషి అంటూ

ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుతం నల్గొండ ఎస్పీ ఆవుల వెంకట రంగనాథ్‌ ఏకంగా హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ వాఖ్యానాలు చేశారు. ఆ వీడియోలను సిబిఐ నిశితంగా పరిశీలించినట్లు తెలిసింది. అంతేకాకుండా కొందరు పోలీసు అధికారులకు పెద్దమొత్తంలో నగదు మార్పిడి జరిగినట్లు సిబిఐ కి సమాచారం అందింది. అది ఏ రూపంలో ఎవరి ద్వారా ఎవరికి చేరిందనే కోణంలో పరిశోధన చురుగ్గా సాగుతోంది. దానికి తోడుగా న్యాయస్థానం రికార్డులు తారుమారు చేసిన గత వైనాలపై సిబిఐ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. సత్యంబాబుపై తాము ఎప్పుడు అనుమానాలు వ్యక్తంచేయలేదని.. పోలీసులే కేసును తప్పుదోవ పట్టించారని అయేషా తల్లిదండ్రులు సైతం స్పష్టంచేశారు. కాగా….2018 నవంబర్‌ 29న కేసు కొత్త మలుపు తిరిగింది. ఆయేషా విూరా హత్య కేసును మళ్లీ విచారణ చేయాలంటూ సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. విజయవాడ కోర్టు కస్టడీలో ఉన్న ఆయేషా విూరా కేసు ఆధారాలను నాశనం చేశారంటూ ఆయేషా విూరా తల్లి హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కేసును మొదటి నుంచి విచారణ చేయాలని, కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును దర్యాప్తు చేయాలని కోర్టు సీబీఐ నిఆదేశించింది. అందులో భాగంగా సీబీఐ శుక్రవారం సత్యంబాబును విచారిస్తోంది. సత్యం బాబు కుటుంబ సభ్యుల స్టేట్‌ మెంట్ను సీబీఐ అధికారులు రికార్డ్‌ చేసుకున్నారు. విజయవాడలోని నందిగామ సవిూపంలోని అనగమసాగరం గ్రామంలో సీబీఐ అధికారులు విచారించారు. ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గా హాస్టల్‌ నిర్వాహకులను సైతం సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసం అయిన అంశంపై పి.కుమారి, పి. వెంకటకుమార్‌, వై సుబ్బారెడ్డిలపై కేసు నమోదు చేశారు. అయేషా విూరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

కూపీలో కదులుతున్న ఖమ్మం కోర్టు రికార్డులు:

ఈ కేసులో నగదు భారీగానే దండుకున్న ఓ అధికారి ఖమ్మం న్యాయస్థానంలో కూడా రికార్డుల దిద్దుబాట్లపై, ఇతర కేసులపై సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నారు. ఈ అధికారికి వంత పాడిన నాటి అధికారుల విషయాలపై కూడా సిబిఐ అధికారులు తవ్వడం మొదలెట్టారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా న్యాయమూర్తిపై వచ్చిన పిర్యాదుపై కూడా అధికారులు ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here