కనబడన కవిత..!

0

సమీక్షలు, సమావేశాల్లో ఆచూకి లేదు..

నిజామాబాద్‌లో ఇప్పటికి అడుగే లేదు…

రాజకీయాలకు ఇక దూరమేనా…

బతకమ్మ ఆట.. ప్రతి జిల్లాలో జాగృతి పేరుతో అందరిని ఉత్సాహపరిచే కల్వకుంట్ల కవితక్క ఓటమి పాలైనప్పటి నుంచి ఇప్పటికి కంటికి కనబడడం లేదు.. యువతలో మంచిపేరు సంపాదించుకుంటూ, ప్రతి కార్యక్రమాల్లో నేనున్నానంటే

ముందుకు నడిచే కవిత ఎందుకు దూరంగా ఉందని తెరాస శ్రేణులే విస్మయం చెందుతున్నారు.. పార్టీ కార్యక్రమాల కోసం ఆవిడ జిల్లాకు వస్తున్నారంటే చాలు అందరూ ఆమె మెప్పు పొందేందుకు మరీ మరీ పోటీ పడి కార్యక్రమాలు

చేసేవారు. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత మొన్న జరిగిన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది. టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి, తన తండ్రి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న

కూడా కవిత ఓటమి పాలవడాన్ని జీర్ణించుకోలేకనే పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కవిత ఓటమితో పార్టీ శ్రేణుల్లో కూడా నిస్తేజం అలుముకుంది. అందుకే ఓటమి తర్వాత ఎక్కడికి వెళ్లకుండా, పార్టీ కార్యక్రమాల్లో పాల్పడకుండా

ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది.. కేవలం ట్విట్టర్‌ వేదిక ద్వార తన అభిప్రాయాలను షేర్‌ చేస్తున్నారు. ఆమె జిల్లాకు రాకపోవడంతో, ప్రజాప్రతినిధులు ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా మారింది. ముందుకు నడిపించే

నాయకురాలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు. కవితక్క లేని లోటు జిల్లా పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందని నిజామాబాద్‌ జిల్లాకు కవిత రావాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవల నూతన పార్టీ భవన నిర్మణాలకు శంకుస్ధాపన చేపట్టింది. జిల్లాలోను ఆ కార్యక్రమం అట్టహాసంగా సాగినా, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్‌ స్పష్టంగా కనిపించింది. మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని కొందరు ఎమ్మెల్యేలు

పట్టించుకోవడం లేదని, పార్టీలో టాక్‌ నడుస్తోంది. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి సైతం స్పీకర్‌ బాధ్యతల్లో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ ముందుకు

నడిపించే కవిత, జిల్లాకు రాకపోవడం వల్ల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు జిల్లాలో అంతంత మాత్రంగా సాగుతోంది. ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు అంతగా పట్టించుకోవడం లేదని, పార్టీలో చర్చ జరుగుతోంది. కవిత

ఉండి ఉంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పండగ వాతావరణంలో జరిగేవని సీనియర్‌ నేతలు అధిష్ఠానానికి మొర పెట్టుకున్నారంట. ప్రస్తుతం జిల్లా మంత్రిగా వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉన్నా, ఆయన తన నియోజకవర్గంపైనే ఫోకస్‌

ఎక్కువ పెడుతున్నారట. మున్సిపల్‌ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో కవిత జిల్లాకు వస్తేనే, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు సమన్వయంతో ముందుకెళ్లే అవకాశం ఉందని, ఆమె మున్సిపల్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోకపోతే, నష్టం

వాటిల్లే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల నుంచి హైదరాబాద్‌కు పరిమితమైన కవిత, జిల్లాకు ఎప్పుడొస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏదైనా మంచి పదవితోనే ఆమె జిల్లాలో అడుగుపెడతారని

పార్టీలో టాక్‌ నడుస్తుండగా, ఆ పదవి ఏంటన్నది అంతుచిక్కడం లేదు. జిల్లాకు పెద్ద దిక్కుగా మారిన మాజీ ఎంపీ కవిత, జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తే శ్రేణుల్లో నూతనోత్సాహాం వస్తుంది. మున్సిపల్‌ ఎన్నికల వేళ

ఆమె జిల్లాకు వస్తారా రారా అన్నది ఉత్కంఠగా మారింది. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని కార్యకర్తలు మాత్రం కోరుతున్నారు. మరి కార్యకర్తల మొర కవిత ఆలకిస్తారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here