జాతీయ వార్తలు

ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ భేటీ

బడ్జెట్‌ రూపకల్పనకు ముందే చర్చలు

ఆర్థిక మందగమనం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం

న్యూఢిల్లీ

బజ్డెట్‌ సమావేశాలపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. అలాగే ఆర్థిక మందగమనం నేపథ్యంలో బడ్జెట్‌ విధివిధానాలపై దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల సలహాలను కోరారు. గురువారం నీతి ఆయోగ్‌ భవన్‌లో జరిగిన భేటీలో దేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇందులో మంత్రులు అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు. అమూల్యమైన సలహాలు ఇవ్వాలని ప్రధాని వారిని కోరారు. అలాగే ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఇదిలావుంటే ఆర్థిక అభివృద్ధికి సంబంధించి రానున్న బ్జడెట్‌లో ప్రజల డిమాండ్లు, ఆకాంక్షలకు తగ్గట్టు ఎటువంటి అంశాలు ఉండాలో ప్రజలు నేరుగా సూచనలు పంపాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం అభ్యర్థించారు. ఒక మోస్తరు దేశ ప్రగతి 5 శాతం వరకు ప్రభుత్వం ఆశిస్తున్న నేపథ్యంలో ప్రధాని బ్జడెట్‌ రూపకల్సనలో ప్రజల అభి ప్రాయాలను కోరడం ఈ సందర్భంగా గమనార్హం. కేంద్ర బ్జడెట్‌ 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని, దేశ అభివృద్ధి పథానికి మార్గం చూపిస్తుందని అందుకని మీ అందరి ఆలోచనలు, ప్రతిపాదనలు స్వాగతిస్తున్నానని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈ సూచనలన్నిటినీ పరిశీలించి వచ్చే బ్జడెట్‌ ప్రవేశ పెడతారని ఆయన వివరించారు.

నిర్మలా సీతారామన్‌ ఎక్కడ?

కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బ్జడెట్‌పై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ముఖ్య ఆర్థికవేత్తలతో భేటీ అయ్యారు. బ్జడెట్‌ రూపకల్పన, నిధుల కేటాయింపు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పియూష్‌ గోయల్‌, నీతిఅయోగ్‌ ప్రతినిధులు, పలువురు ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. అయితే బ్జడెట్‌ రూపకల్పన చర్చించే ఈ భేటీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. కీలకమైన సమావేశానికి ఆర్థికమంత్రి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అసలిక్కడ ఏం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 ఏడాదికి బ్జడెట్‌ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

2022లో కొత్త పార్లమెంట్‌ భవనం

ఇదిలావుంటే 2022లో 75వ దేశ స్వాతంత్య వార్షికోత్సవాల సందర్భంగా పార్లమెంటు సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం వెల్లడించారు. నవభారత్‌ స్వప్నం నెరవేరేందుకు భారత పార్లమెంటు 2022లో సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహిస్తుందని చెప్పారు. కెనడా లోని ఒట్టావాలో 25 వ కాన్ఫరెన్సు ఆఫ్‌ స్పీకర్స్‌, అండ్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌ ఆఫ్‌ ది కామన్‌వెల్తు (సిఎస్‌పిఒసి) సదస్సులో స్పీకర్‌ మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంటు భవనం 1927 నుంచి సమావేశాలు నిర్వహిస్తోందని, ఇప్పటికి 92 సంవత్సరాలు పూర్తయ్యాయని బిర్లా వివరించారు. రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్‌ వరకు సెంట్రల్‌ విస్టా పునరుద్ధరణ మరో 250 సంవత్సరాల అవసరాల మేరకు చేపట్టడమవుతోందని చెప్పారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close