రైతుకు వరాలు ప్రకటించే యోచన

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని రైతులకు భారీ వరాలు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు వస్తున్న తరుణంలో మరిన్ని పథకాలు ప్రకటించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు సమాచారం. ఇటీవలి రైతుల ఆందోళనల నేపథ్యంలో పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ విూడి యా కథనాల ప్రకారం ప్రధాని మోదీ బుధవారం సాయం త్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌లతో సమావేశ మమ్యారు. మోదీ నివాసంలో మూడు గంటలపా టు జరిగిన ఈ సమావేశంలో రైతుల కోసం కొత్తగా కొన్ని చర్యలను ప్రకటించబోతోంది. వచ్చే నెల 5న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. అంతకుముందే ఈ ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. కనీస మద్దతు ధరకు, మార్కెట్‌ ధరకు మధ్య వ్యత్యాసాన్ని రైతులకు నేరుగా చెల్లించడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు ఆలోచన జరిగినట్లు సమాచారం. మధ్య ప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం అమలు చేసిన భవతార్‌ స్కీమ్‌ (ధరల వ్యత్యాసం పథకం) విధానంలో ఈ నూతన పథకాన్ని రూపొందించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here