Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువిద్యస్టేట్ న్యూస్

ప్రణాళిక @ 30 రోజలు

గ్రామాల అభివృద్ధిలో రాజీలేదు

  • పంచాయితీలకు నిధుల కొరత ఉండదు
  • 6 నెలల్లోపు శ్మశాన వాటికలు
  • 85శాతం మొక్కలు బతకాలి..
  • రాజేంద్రనగర్‌ సమావేశంలో సిఎం కేసీఆర్‌

హైదరాబాద్‌

పంచాయతీల అభివృద్ధిలో రాజీపడేది లేదని, ఇచ్చిన సూచనల మేరకు గ్రామాఉల పచ్చగా

కళకళలాడాల్సిందేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. పంచాయితీల అభివృద్దికి నిధుల కొరత లేదని

కూడా సిఎం స్పష్టీకరించారు. పంచాయితీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ రాజేంద్రనగర్‌లో విస్తృతస్థాయి

సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ

సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పంచాయితీలకు నిధుల కొరత ఉండదనీ, ప్రతీ గ్రామంలోనూ

రాబోయే 6 నెలల్లోపు శ్మశాన వాటికలు నిర్మించాలనీ, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం

కేటాయిస్తుంది. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు

తెలిపారు. గ్రామ పంచాయతీ అవసరాల కోసం ట్రాక్టర్‌ సమకూర్చుకోవాలని పంచాయతీ సిబ్బందికి

సూచించారు. 500 జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రూ. 8 లక్షలు మంజూరు చేస్తామని

ఆయన అన్నారు. ఆరో తేదీ నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనీ,

హరితహారంలో, ఇప్పుడు పంపిణీ చేసి నాటిన 85 శాతం మొక్కలు బతికి తీరాల్సిందేననీ, లేని

పక్షంలో సర్పంచ్‌లపై వేటు వేస్తామన్నారు. మిషన్‌ భగీరథతో తాగునీటి అవసరాలు తీరాయన్నారు.

గ్రామాభివృద్ది తనిఖీ చేయడానికి వంద బృందాలను ఏర్పాటు చేస్తామనీ, 30 రోజుల ప్రణాళిక

అనంతరం ఈ బృందాలు రంగంలోకి దిగుతాయన్నారు. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు

ప్రోత్సాహకాలిస్తామన్నారు. అలసత్వం, అజాగ్రత్త వహించిన గ్రామ సర్పంచ్‌, కార్యదర్శులపై చర్యలు

తప్పవన్నారు. ఇకపై ఒక్కో గ్రామానికి ఏడాదికి 7 వేల మొక్కలు మంజూరు చేస్తామని తెలంగాణ

సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 85శాతం మొక్కలు బతకాలి.. లేకుంటే ఉద్యోగాలు ఊడతాయని

సీఎం వార్నింగ్‌ ఇచ్చారు. కలెక్టర్ల వార్షిక నివేదికలు ఇకపై తానే రాస్తానని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

100 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లు, ప్లయింగ్‌ స్క్వాడ్‌తో పరిశుభ్రమైన వాతావరణంలో ఈ

దసరా జరుపుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గ్రామాల్లో 30 రోజుల

ప్రణాళికలపై మంగళవారం నాడు కేసీఆర్‌ దిశానిర్దేశర చేశారు. ఈ సందర్భంగా ఒక్కో గ్రామానికి

ఇన్‌ఛార్జ్‌లుగా మండలస్థాయి అధికారులను నియమించడం జరిగింది. ప్రజాభాగస్వామ్యంతో

గ్రామాల రూపురేఖలు మారుస్తామని కేసీఆర్‌ తెలిపారు. మొదటి రోజు గ్రామ సభ నిర్వహిస్తామని..

రెండో రోజుకో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల

ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం కానుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.కలెక్టర్లు, మండలస్థాయి

అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలనీ, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇచ్చి

వాటిని సంరంక్షించేలా చూడాల న్నారు. ఖచ్చితంగా కృష్ణ తులసి మొక్క విధిగా ఇవ్వాలన్నారు.

గ్రామ విస్తీర్ణానానికి అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. పచ్చదనాన్ని కాపాడే కలెక్టర్లకు

మార్కులుంటాయనీ, పట్టించుకోని కలెక్టర్లకు ప్రతికూల మార్కులుంటాయన్నారు. కార్యక్రమంలో

మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ప్రజలు

పాల్గొన్నారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.

సమావేశంలో గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలపై కేసీఆర్‌ దిశానిర్దేశర చేశారు. ఒక్కో గ్రామానికి

ఇన్‌ఛార్జ్‌లుగా మండలస్థాయి అధికారులను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌

సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. ప్రజాభాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు

మారుస్తామన్నారు. మొదటి రోజు గ్రామ సభ నిర్వహిస్తామని.. రెండో రోజు కో- ఆప్షన్‌ సభ్యుల

ఎంపిక చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ స్టాండింగ్‌ కమిటీలను ఎంపిక

చేస్తామన్నారు. సర్పంచ్‌ కుటుంబ సభ్యులను కో ఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక చేయడానికి వీలు

లేదన్నారు. ఈ నెల 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేయనున్నట్లు

సమావేశంలో కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌,

ఈటల రాజేందర్‌ మినహా మంత్రులంతా హాజరయ్యారు. కాగా.. తలసాని తిరుపతికి వెళ్లగా..

హైదరాబాద్‌లో సీజనల్‌ వ్యాధులపై ఈటల కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు మంత్రులు

సమావేశానికి హాజరుకాలేకపోయారు.

దసరా తర్వాతే విస్తరణ..

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు..? ఈసారి బెర్తులు దక్కేదెవరికి…. కేటీఆర్‌, హరీష్‌

రావులకు చోటు దక్కుతుందా…? మంత్రి వర్గ విస్తరణకు బడ్జెట్‌ సమావేశాలు, పండుగలు

అడ్డంకులుగా మారాయా…? ఆశావహులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మంత్రి వర్గ

విస్తరణ దసరా తర్వాత ఉండే అవకాశం ఉంది. గవర్నర్‌ బదిలీ కావడం, బడ్జెట్‌ సమావేశాలు,

బతుకమ్మ పండుగ వరుసగా వస్తుండటంతో పండగ తర్వాత విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌

భావిస్తున్నారు. మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్న దానిపై కేసీఆర్‌ ఇప్పటికే కసరత్తు

పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభమై

మూడు వారాల పాటు కొనసాగనున్నాయి. మరోవైపు నర్సింహన్‌ స్థానంలో గవర్నర్‌గా తమిళిసైని

కేంద్రం నియించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లోగా మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చని

పార్టీ వర్గాలంటున్నాయి. కొత్త మంత్రి వర్గ విస్తరణలో మరో ఆరుగురికి బెర్త్‌ దక్కనున్నట్లు

తెలుస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తోపాటు మాజీ మంత్రి హరీష్‌ రావుకు తిరిగి

మంత్రివర్గంలో చోటు కల్పించడంపై టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. దసరా తర్వాత జరిగే మంత్రి

వర్గ విస్తరణలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సత్యవతి

రాథోడ్‌కు బెర్తులు ఖాయమైనట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కు

కేబినెట్‌ ¬దాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి అప్పగించారు. అదే సామాజిక వర్గం

నుంచి ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం

వహిస్తున్నారు. అయితే హరీశ్‌ రావుకు చోటు కల్పించకుండా తాను ఒక్కడినే మంత్రి వర్గంలో చేరితే

విమర్శలు వస్తాయన్న కేటీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. కూకట్‌పల్లి కార్యకర్తల సమావేశంలో

కేటీఆర్‌ను మళ్లీ మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

మరోసారి మంత్రులుగా కేటీఆర్‌, హరీశ్‌ రావు సెక్రటేరియట్‌లో అడుగుపెడుతారా…? వారికి అవకాశం

ఇవ్వబోతున్నారా అన్న విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close