పింక్‌ కలువ అందం

0

వెరైటీ కాస్ట్యూమ్స్‌.. వెరైటీ వేషధారణలతో అలరించే అరుదైన వేదికగా మెట్‌ గాలా ఈవెంట్‌ అలరిస్తోంది. న్యూయార్క్‌ లో జరుగుతున్న ఈ ఫ్యాషన్‌ ఈవెంట్‌ సరికొత్త వయ్యారాలతో హీటెక్కించింది. ఈ ఈవెంట్‌ లో ప్రియాంక చోప్రా.. కిమ్‌ కర్థాషియన్‌.. మిలీ సైరస్‌.. లేడీ గాగ లాంటి స్టార్లు ఫ్యాషన్‌ పరంగా సరికొత్తగా తమని తాము ఆవిష్కరించుకున్నారు. ఎవరికి వారు తమ ప్రత్యేకతను నిలుపుకునే కొత్త పంథా డిజైనర్‌ దుస్తుల్లో దర్శనమిచ్చారు. మేకప్‌ పరంగానూ కొత్తదనం కనిపించింది. అలాగే మెటా గాలా 2019 ఈవెంట్‌ ఆద్యంతం పింక్‌ కార్పెట్‌ థీమ్‌ ని ఫాలో అవ్వడం ఆసక్తిని రేకెత్తించింది. ఇదే పింక్‌ కార్పెట్‌ పై అందాల దీపిక పదుకొనే బార్బీ బొమ్మను తలపించింది. కొలనులో పింక్‌ కలువ విచ్చుకున్న చందంగా తన గౌనుని డిజైన్‌ చేసిన తీరు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ రూపంలో దీపిక అందం ఇనుమడించింది. క్యాంప్‌ నోట్స్‌ ఆన్‌ ఫ్యాషన్స్‌ అనే థీమ్‌ ని ఈ ఈవెంట్‌ లో అనుసరించారన్నది మరో హైలైట్‌.పిక ధరించిన ఈ గౌన్‌ ని ఏమని పిలుస్తారు? అంటే.. జాక్‌ పోసెన్‌ గౌన్‌ అని పిలుస్తున్నారు. డీత్రోన్స్‌ బార్బీ..! అంటూ ముచ్చటగా పిలుచుకున్నారంతా. కేన్స్‌ సినిమా ఉత్సవాలు సహా పలు అంతర్జాతీయ ఫ్యాషన్‌ ఉత్సవాల్లో పాల్గొన్న దీపికకు ఇలాంటి వెరైటీ వస్త్రధారణ కొత్తేమీ కాదు. అయితే ఈసారి మెట్‌ గాలా ఈవెంట్‌ కోసం ప్రిపేరైన తీరు సంథింగ్‌ ఇంట్రెస్టింగ్‌. ఆ పొడవాటి గౌనును నేలపై పొర్లకుండా మోసేందుకు ఒక అసిస్టెంట్‌ ఆ ఈవెంట్‌ వద్ద కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. గౌనుకు తగ్గట్టే తన తలకట్టును దీపిక పూర్తిగా మార్చేసింది. హెయిర్‌ ని ఒక రెయిన్‌ బోలా విరబోసి దానికి హెయిర్‌ బ్యాండ్‌ ను ధరించి కొత్తందం తెచ్చింది. ఇదే వేదికపై వరల్డ్‌ రిచెస్ట్‌ పారిశ్రామికవేత్త.. బిజినెస్‌ మేన్‌ ముఖేశ్‌అంబానీ కూతురు ఇషా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here