Featuredస్టేట్ న్యూస్

అయ్యా..ఎస్‌ ఫోన్లు ట్యాపరింగ్‌

ప్రత్యేక అధికార్ల సంభాషణపై సర్కారు నిఘా..

˜ ప్రభుత్వం వద్ద కీలక సమాచారం

˜ తాజాగా కరీంనగర్‌ ‘కలెక్టర్‌’ ఫోన్‌ లీక్‌

˜ రాజకీయ నేతల ఇరకాటంలో కలెక్టరే ‘బలిపశువు’

కరీంనగర్‌ బ్యూరో (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణలో కీలక శాఖల అధికారులు, జిల్లాల పాలనా ధికారులకు సంబంధించిన వ్యక్తి గత ఫోన్లు ట్యాపరింగ్‌కు గురైనట్లు సర్వత్రా ప్రచారం జోరం దుకుంది. తాజాగా కరీంనగర్‌ కలెక్టర్‌ సర్వరాజ్‌ అహ్మద్‌ ఫోన్‌ లీకేజ్‌ కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఐఎఎస్‌, కీలక అధికారులకు పోన్లు ట్యాపరింగ్‌ అయింది నిజమేననే సందేహానికి రుజువు అవుతోంది. అయితే ఇది అవుననే ప్రజలు అధిక సంఖ్యలో భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కలెక్టర్‌ సర్వ రాజ్‌ అహ్మద్‌ ఎన్నికల అధికారిగా వ్యవరించిన సమయంలో గుట్టుగా అతడి ఫోనును ట్యాప్‌ చేసినట్లు తెలుస్తుంది. కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ సర్వరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుకున్న ఫోన్‌ సంభాషణ తాజాగా లీకేజైన సంఘటన యావత్తు దేశ వ్యా ప్తంగా రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే.. ఇప్పటికీ ఈ ఫోన్‌ లిక్‌ తంతంగం సోషల్‌ మీడ యాలో చక్కర్లు కొడుతూ..నే ఉంది. అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతలు ఆడుతున్న రాజకీయ చద రంగంలో కొందరు ఐఎఎస్‌ అధికారులతో పాటు కొన్ని కీలక శాఖ అధి కారులు బలిపశువులు అవుతున్నారని ఆనోట. ఈ నోట వినిపిస్తోంది. కరీంనగర్‌లో అదే జరిగింది. ఎన్నికలలో అధికార పార్టీ తరుపున పోటి చేస్తున్న అభ్యర్తి లెక్కకు మించి ఖర్చు పెట్టారని, ఈ విషమంలో గంగుల కమ లాకర్‌పై నరహత వేటు వేయాలనే నేపంలో వివిధ రకాల కారణాలతో బిజెపి తరుపున పోటిలో ఉన్న అభ్యర్తి బండి సంజయ్‌(ప్రస్తుతం ఎంపి) ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలి సిందే. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్‌ ఇటీవల చేపట్టిన మంత్రివర్గంలో మంత్రి హోదాలో ఉన్నారు.

ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమిపాలైన బిజెపి బండి సంజయ్‌ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపిగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే కరీంనగర్‌లో ఈ రచ్చ అగ్ని గుండంలా కాలుతూనే ఉంది. అప్పటి నుండి మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపి బండి సంజయ్‌ మధ్య రాజకీయంగా రాజకీయ రగడ రాజుకుంటోంది. ఒకరి వైఫల్యాలు ఒకరు ఎత్తిచూపుతూ.. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుం టున్నారు. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది. తాజాగా ఎంపి బండి సంజయ్‌, కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ మధ్య జరిగిన ఫోన్‌ ట్యాపరింగ్‌ వ్యవహారం రోజు రోజుకు చిలికి చిలికి సుడి వానగా మారుతోంది. ఇది మంత్రి వర్గంలోని వారే కావాలని చేయించాలని బిజెపి వర్గీయులు, కాదు.. కాదు.. బండి సంజయ్‌ వర్గీయులే లీక్‌ చేసి తనను ఇబ్బందులకు నీచ రాజకీయాలకు పాల్ప డుతున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ వర్గాయుల మధ్య రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ వివాదం ఎటు వైపు దారిచూస్తోందని కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. మరో వైపు రాజకీయ నేతల మధ్య ఫోన్‌ ట్యాపరింగ్‌కు గురైన కలెక్టర్‌ మాత్రం బలిపశువు అయ్యారని ప్రజలు వాపోతున్నారు. ఒక వర్గం వారు కలెక్టర్‌ ఫోన్‌ లీక్‌ సంభాషణను ప్రభుత్వం సిఎంవో ఆఫీసుకు చేరవేశారు. కలెక్టర్‌ హోదలో ఉన్న ఆయన ఫోన్‌ లీక్‌ కావడం రాజ్యంగ విరుద్దమని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాగా ఇది కావాలని తనపై బురదజల్లే పనిలో భాగంగానే తన ఫోన్‌ను ట్యాప్‌ చేసి లేనిఫోని సృష్టించి కుట్రతో తనను ఇరుకాటంలోకి నెట్టివేస్తున్నారని కలెక్టర్‌ ఆవేధనకు గురవు తున్నారు. అయితే ఇది ఒక్క కరీంనగర్‌ జిల్లాకే పరిమితం కాలేదు.. కీలక శాఖల అధికా రులు, ఐఎఎస్‌ అధికారుల ఫోన్టు ట్యాపరింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. బయటపడింది ఒక్క కరీం నగర్‌ కలెక్టర్‌ ఫోక్‌ లీకేజ్‌ కాగా ఇలా పలువురి ఐఎఎస్‌ అధికారులు, కీలక శాఖల అధికారుల ఫోన్‌ లీకులు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. కరీంనగర్‌ కలెక్టర్‌ ఫోన్‌ లీక్‌ వ్యవహరంలో రాష్ట్ర వ్యా ప్తంగా ఐఎఎస్‌ అధికారులు, ముఖ్య శాఖల అధికారులు సైతం తమ తమ ఫోన్లు లీకేజీపై తర్జనభర్జన అవు తున్నారు. ఎవరి చిట్లా ఏ రూపంలో బయట పడుతుందోననే సందేహాన్ని తమలో తాము ఆత్మ విమర్శలో పడ్డారు. ఏది ఏమైనా కరీంనగర్‌ కలెక్టర్‌ ఫోన్‌ లీక్‌ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close