Featuredస్టేట్ న్యూస్

పట్టువదలని కేసీఆర్‌

  • స్టాలిన్‌ కోసం మరోసారి చెన్నై
  • ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించనుట్లు సమాచారం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చల్లో భాగంగా ఇప్పటికే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన తెలంగాణా సీఎం కేసీఆర్‌ సోమవారం డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌ తో భేటి కానున్నారు. అందులో భాగంగా కేసీఆర్‌ ఆదివారం తమిళనాడుకి బయలుదేరి వెళ్ళారు. నిజానికి ఈ పర్యటన గత సోమవారం జరగాల్సిందే… దక్షణాది పర్యటన విషయం గురించి కేసీఆర్‌ ముందే స్టాలిన్‌ కి వివరించారు. కానీ అయన ఈ నెల 13న చెన్నైకి రావాల్సిందిగా కోరారు. దీనిపైన ప్రసార మాధ్యమాలలో వివిధ కధనాలను ప్రచురించాయి. దీనితో చెన్నై పర్యటన చాలా ప్రశ్నార్ధకంగా మారింది. కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా చెన్నై పర్యటనకు వెళ్తారు.. అక్కడికి చేరుకున్న తర్వాత శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను సందర్శించుకుంటారు. రాత్రి అక్కడ బస చేసి సోమవారం స్టాలిన్‌తో భేటి అవుతారు కేసీఆర్‌. ఫెడరల్‌ ఫ్రంట్‌లోని అంశాలపైన, ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల పై అందులో ఫెడరల్‌ ఫ్రంట్‌ పోషించావాల్సిన పాత్ర గురించి ఇరువురు చర్చించుకుంటారు . ఇందులో టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌ పాల్గొనడం లేదని సమాచారం.

స్టాలిన్‌, కేసీఆర్‌ ల భేటీపై సస్పెన్స్‌

డీఎంకే నేత స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ నెల 13న స్టాలిన్‌తో ఆయన భేటీ అవుతారని తెలంగాణ సీఎంవో ప్రకటించింది. అయితే ఆ రోజున ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉన్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీరిద్దరి భేటీకి అవకాశమే లేదని తమిళ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో వీరి సమావేశంపై సస్పెన్స్‌ వీడటం లేదు. కాగా దేశంలో మోదీ, రాహుల్‌ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఉండాలని భావిస్తున్న కేసీఆర్‌.. అందుకు అనుగుణంగా నిదానంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేరళ సీఎం పినరయిని కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించిన కేసీఆర్‌.. స్టాలిన్‌తో భేటీ అవ్వాలని భావించారు. అయితే మహాకూటమికి మద్దతిస్తోన్న స్టాలిన్‌.. కేసీఆర్‌తో కలిసేందుకు సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌కు స్టాలిన్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని సమాచారం. తన ఫ్రంట్‌ వ్యూహంలో భాగంగా లోగడ చెన్నై వెళ్లిన కేసీఆర్‌కు డీఎంకే వర్గాలు రెడ్‌ కార్పెట్‌ పరిచిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో స్టాలిన్‌ కూడా ఈ ప్రతిపాదనపై ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కేసీఆర్‌తో సమావేశం అవుతారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. తమిళ మీడియా వార్తలకు ప్రాతిపదిక ఏమిటన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

సీతారాం ఏచూరితో కేసీఆర్‌ చర్చలు

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల సమావేశమయ్యారు. అయితే విజయన్‌తో సమావేశం కావడానికి ముందే తెలంగాణ సీఎం కేసీఆర్‌ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చర్చించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ప్రాంతీయ పార్టీల అధినేతలు, ఆయా ప్రాంతీయ పార్టీల నేతృత్వంలోని ముఖ్యమంత్రులను కూడ కేసీఆర్‌ కలుస్తున్నారు. వారం రోజుల క్రితం కేరళ సీఎం విజయన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయమై చర్చించారు. అయితే కేరళ సీఎం విజయన్‌తో సమావేశం కావడానికి ముందు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చర్చించారు.దేశంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు విషయమై చర్చించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాతే ఈ విషయమై ఓ స్పష్టత వస్తోందని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం లేదా కాంగ్రెస్‌ పార్టీ బయటి నుండి మద్దతిస్తే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీయేతర పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సీపీఎం నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఏచూరి అభిప్రాయపడ్డారు.


అప్పుల్లో ఏపీ ఆర్టీసీ

  • ప్రభుత్వ బకాయిలు రూ. 80 కోట్లు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుందా? కార్మిక సంఘాలను చర్చలకు పిలుస్తామంటూనే ఆర్టీసీ ఎండీ నష్టాలపై క్లారిటీ ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు వసూలు చేయకపోగా… ప్రజలపై ఛార్జీల భారం మోపి నష్టాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందా? ఉద్యోగుల కుదింపు అందులో భాగమేనా? ఆసలే ఏపీఎస్‌ ఆర్టీసీ అప్పుల్లో ఉంది. గత కొన్నేళ్లుగా అధికారుల నోటి వెంట వినపడుతున్న మాట ఇది. అప్పుల్లో ఉన్న సంస్థను బయట పడేయాలని యాజమాన్యం నానాతిప్పలు పడుతోంది. వీలైనంత మేర ఆర్టీసీలో ఆదా చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ.. సంస్థకు రావాల్సిన బకాయిలపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. అడుగుదామంటే మొహమాటం, అడగకపోతే గుట్టలా పేరుకుపోతున్న బకాయిలు. వెరసి ఏం చేయలేక మౌనం వహిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. చేతికి దొరికిందే మహాప్రసాదం అన్నట్టుగా ప్రభుత్వం పెండింగ్‌ బిల్స్‌ ఎంత క్లియర్‌ చేస్తే అంత వరకు తీస్కొని సంతోష పడుతోంది. ఈ ఏడాది జనవరి నుండి పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్ని ప్రభుత్వం ఉచితంగా వినియోగించుకుంది. నిత్యం వందకు పైగా బస్సులు… రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలవరానికి వస్తున్నాయి. ఎవరైనా పోలవరాన్ని చూడాలనుకుంటే బస్సులో ఎక్కితే చాలు… ఎక్కడ ఎక్కారో తిరిగి అక్కడే దింపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇలా ఏడాదిన్నరగా 19 వేలకు పైగా ట్రిప్పులను ఆర్టీసీ పోలవరానికి నడిపింది. పోలవరం సందర్శన కోసం 19 వేల 923 బస్సులను ఆర్టీసీ నడిపింది. వీటి అద్దె విలువ రూ. 74 కోట్లు. గత ఏడాదిన్నరగా ట్రిప్పులు నడుస్తున్నా… ఇప్పటివరకు ప్రభుత్వ చెల్లించింది రూ. 8.68 కోట్లు మాత్రమే. ఇంకా రూ. 65.80 కోట్లు బకాయి పడింది. అలాగే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల సందర్శన కోసం దివ్యదర్శనం పేరుతో 1984 బస్సులు ఆర్టీసీ నడుపుతోంది. వీటి అద్దె విలువ రూ. 24 కోట్లు. దేవాదాయశాఖ చెల్లించిన అమౌంట్‌ రూ. 16.60 కోట్లు. పెండింగ్‌ అమౌంట్‌ రూ. 8.93 కోట్లు. ఇక.. అమరావతి దర్శనం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా సచివాలయం, హైకోర్ట్‌, అసెంబ్లీ చూడలనుకునేవారి కోసం… ఆర్టీసీ 1518 బస్సులను నడిపింది. వాటి అద్దె విలువ రూ. 6.35 కోట్లు. ప్రభుత్వం చెల్లించింది కేవలం కోటి రూపాయలు. ధర్మపోరాట దీక్షల కోసం 13 వేల 8 బస్సులు నడపగా… దీనికి రావాల్సిన రూ. 34 కోట్ల 39 లక్షల అద్దెను పూర్తిగా చెల్లించారు. ఇలా మొత్తం కలిపి 36 వేల 433 బస్సుల్ని ఆర్టీసీ తిప్పితే… దానికి రావాల్సిన ఆదాయం రూ. 140 కోట్లు. కానీ ఇప్పటిదాకా చేతికి అందింది రూ. 60 కోట్లు మాత్రమే. ఇంకా రూ. 80 కోట్లకు పెండింగ్‌ అమౌంట్‌ చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఆర్టీసీ అధికారుల మెతక వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం అడిగింది కదా అని వేల బస్సులు తరలించి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురి చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు, పార్టీల కోసం డబ్బు చెల్లిస్తే గాను అద్దెకు బస్సులు

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close