చునావ్‌కి సూచీ బదల్‌రహీహై

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నవంబరు 11 కాంగ్రెస్‌ చిట్టా మారుతోంది. ఖరారైన పేర్లను మరోసారి వడపోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హమ్మయ్య చిట్టాలో నా పేరు ఉంది అని నిన్నటిరోజున గుండెల మీద చేతులువేసుకుని పడుకున్న వారికి మళ్ళీ కంటిమీద కునుకులేకుండా తయారైంది. ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఊడుతుందో, ఏ పేరు యాడ్‌ అవుతుందో అర్థంకాని పరిస్థితి. అధిష్ఠానానికి, కార్యకర్తలకు, లోకల్‌ నాయకు లకు, రాష్ట్రస్థాయి నేతలకు అందరిలోనూ అయో మయమే! అంతా గందరగోళమే! నామినేషన్ల పర్వం మొదలైంది. టిఆరెస్‌ అభ్యర్థులందరికీ బిఫారమ్‌ కూడా దక్కింది. ఇప్పటికే ప్రచారాలలో ఉన్న అభ్యర్థులకు బిఫారాలు అందడంతో మార్పులుంటాయన్న పుకార్లకు తెరవేసినట్ల యింది. దాంతో అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహం తో ప్రచారాలు చేసుకుంటున్నారు. అది చూస్తున్న ఇతర పక్షాల ఆశావహులు తమ పరిస్థితి ఎటూతేలక తీవ్రనిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు.

అభ్యర్థుల జాబితాలో నా పేరు ఉంటుందా? బీసీ కోటాలో సీటు దక్కుతుందా? విద్యార్థులకు ఇస్తే అది నాదే అవుతుందేమో? ఉద్యమకా రుడిగా గుర్తించి ఇస్తారేమో? చివరి క్షణంలో ఏదైనా అద్భుతం జరగొచ్చేమో? లాంటి అనేక ఆలోచనలతో, అపోహలతో అభ్య ర్థులంతా మల్లగుల్లాలు పడుతు న్నారు. కాంగ్రెస్‌ ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠఇది. ఎలాగైనా టికెట్‌ దక్కించుకోవాలన్న పట్టుదలతో పెద్ద ఎత్తున ఆశావ హులు ఢిల్లీలోనే మకాం వేసి తమవం తు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వారి ఆశలకు తగ్గట్లుగానే ఇప్పటికే ఆమోదం పొందిన 74 స్థానాల్లో కొన్నింటిపైన అధిష్ఠానం పునఃపరిశీలన కార్యక్రమం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న 20 స్థానాలకు సంబంధించీ వివరాలను సేకరిస్తోం ది. దీంతో ఆయా స్థానాల్లో టికెట్లకు సంబంధిం చి ఎప్పుడేదైనా జరగొచ్చునన్న ఉత్కంఠ ఆశావహుల్లో మరింత పెరిగింది. భక్తచరణ్‌దాస్‌ నేత త్వంలోని త్రిసభ్య స్క్రీనింగ్‌ కమిటీ కూడా ఆశావహులకు సంబంధించి మరింత సమాచా రాన్ని సేకరించి సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యం గా ఆమోదించిన స్థానాల్లో కొన్నింటిపై.. పెండింగ్‌లో ఉన్న 20 స్థానాల విషయంలోనూ కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకుని వివరా లు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. వరుసగా 3సార్లు ఓడిపోయి ఉన్నారా? 3నెలల కిందటే పార్టీలో చేరి సీటు దక్కించుకుంటున్నారా (ప్యారాచూట్‌)? గత ఎన్నికల్లో 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారా? తదితర వివరాలను కమిటీ సేకరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో ఇటీవల పార్టీలో చేరిన వారు, భాగస్వామ్య పార్టీలు ప్రతిపాదిం చినవి, కుటుంబానికి ఒక టికెట్‌ విషయంలో మినహాయింపులు రానివి తదితర స్థానా లు ఉన్నట్లు చెబుతున్నారు. సూర్యాపేట, మునుగో డు, మిర్యాలగూడ, రాజేంద్రనగర్‌, నారాయణ్‌ పేట్‌, మహబూబ్‌నగర్‌ తదితర స్థానాలు వీటిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏఐసీసీ మార్గదర్శకాలు తూచా తప్పకుండా అమలైతే అభ్యర్థుల జాబితాలో పలు మార్పు లు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని, గెలుపునే ప్రాధాన్యంగా తీసుకుని కొందరికి మినహాయింపులూ లభించవచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ప్రకటన ఎప్పుడు? అభ్యర్థుల ప్రకటన ఎప్పుడన్నదీ ఇంతవరకూ స్పష్టత రాని పరిస్థితి కాంగ్రెసలో నెలకొని ఉంది. కూటమి సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల సర్దుబాట్లు ఆదివారం ఒక కొలిక్కి వచ్చినా పూర్తి స్థాయిలో రాలేదని అంటున్నారు. సోమవారం జరగాల్సిన ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశానికి సంబంధించి సమయం ఇంకా ఖరారు కాలేదు. ఇందుకు సంబంధించి ఆదివారం పొద్దు పోయేవరకూ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సమాచారం అందలేదు. సోమవారం సాయంత్రం సీఈసీ సమావేశం జరిగినా మంగళవారం ఉదయమే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంటుంది. మంగళవారం సీఈసీ సమావేశం జరిగితే.. అభ్యర్థులను అదేరోజు సాయంత్రం ప్రకటించే ఆస్కారం ఉందని అంటున్నారు.

అసంతప్తులకు ‘ఎమ్మెల్సీ’ మంత్రం…అసంతప్త నేతలు, కూటమి భాగస్వామ్య పక్షాలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ‘ఎమ్మెల్సీ’ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. టికెట్‌ రానివారు.. తిరుగుబాటు అభ్యర్థులుగానైనా బరిలో దిగడానికి సిద్ధమవుతుండటంతో.. వారి నిర్ణయం పార్టీ విజయావకాశాలపై పడకుండా చర్యలు తీసుకుంటోంది. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని, ముఖ్యమైన కార్పొరేషన్లకు చైర్మన్లుగా కూడా చేస్తామంటూ హామీలిస్తోంది. మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలకూ ఈ హామీలే ఇస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా సీపీఐ 5 స్థానాలు కోరుతుండగా.. 3 సీట్లే ఇస్తామని కాంగ్రెస్‌ అంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సీట్లకు ప్రత్యామ్నాయంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here